మాలీవుడ్ లో ఆ డైరెక్టర్ చాలా మంచి వ్యక్తి అని పేరు ఉంది. ఎంతో మందికి సాయం చేశాడని ఆయనకు మంచి గుర్తింపు ఉంది. పైగా ఆ దర్శకుడు వ్యక్తిగతంగా కూడా చాల సౌమ్యుడు అంటారు. మరి ఇన్ని ఉన్నా.. ఆ దర్శకుడికి మాత్రం దాదాపు పదహారేళ్ల నుండి ఒక వెలితి బాగా మిగిలిపోయింది. ఇంతకీ ఎవరు ఆ డైరెక్టర్ అంటే… సాజి సురేంద్రన్. ప్రస్తుతం 16 ఏళ్ల తన కల నెరవేరింది అని సాజి ఫుల్ సంతోషంలో తేలియాడుతున్నాడు.
అసలు విషయం ఏమిటంటే.. సాజి సురేంద్రన్ కి పెళ్లై పదహారేళ్లు అవుతుంది. అయితే అతనికి గత ఏడాది వరకు పిల్లలు కలగలేదు. కానీ తాజాగా సాజి తండ్రి అయ్యాడు. ఆ పట్టరాని ఆనందంలో ప్రస్తుతం సాజి మునిగి తేలుతూ తన సన్నిహితులకు భారీ పార్టీలు ఇస్తున్నాడు. అలాగే ఈ విషయాన్ని సాజి సురేంద్రన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడిస్తూ తన సంతోషాన్ని తెలియజేశాడు.
సాజి సురేంద్రన్ మాటల్లోనే.. ‘అవును, కొన్నిసార్లు అదృష్టం సింగిల్ గా రాదు. ఏకంగా డబుల్ డోసులో వస్తూ ఉంటుంది. నా భార్యకు ఇద్దరు మగ కవలలు జన్మించారు, నేను చాల లక్కీ, థ్యాంక్ గాడ్’ అంటూ తన పసిబిడ్డల పాదాల ఫొటోను ఈ క్రియేటివ్ డైరెక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఏది ఏమైనా సుమారు 16 ఏళ్ల నిరీక్షణ తర్వాత, తండ్రి అయ్యాడు కాబట్టి, ఈ స్టార్ దర్శకుడికి సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు
ఇక సాజి సురేంద్రన్ సతీమణి విషయానికి వస్తే.. అతను తన చిన్ననాటి స్నేహితురాలు సంగీతను 2005లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అన్యోన్యంగా ఉండే ఈ దంపతుల జీవితాల్లో ఈ పసి బిడ్డలతో వెలుగులు వచ్చాయి.