
తూర్పు విదర్భపరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో గురు, శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. ఎల్లుండి కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.