Sai Pallavi: సాయిపల్లవి వివాదం: స్పందించిన గవర్నర్ తమిళిసై.. అసలు వివాదమేంటి ?

Sai Pallavi : సాయి పల్లవి అంటేనే మేకప్ వాడదు, పైగా న్యాచురల్ బ్యూటీ. అయితే, ఆమె శ్యామ్ సింగరాయ్ సినిమాలో దేవదాసి పాత్రలో నటించింది. చాలా సాదాసీదాగా కనిపించింది. దాంతో తమిళనాడులోని ఓ పత్రికలో సాయి పల్లవి గురించి ప్రస్తావిస్తూ దేవదాసి పాత్రలో ఆమె అసలు బాగాలేదు అంటూ.. సాయిపల్లవి అసలు అందంగా ఉండదు అంటూ ఓ వార్తను రాశారు. ఈ వార్త పై సాయి పల్లవి అభిమానులు నిరసన కూడా వ్యక్తం చేశారు. అయితే, […]

Written By: Shiva, Updated On : January 31, 2022 10:26 am
Follow us on

Sai Pallavi : సాయి పల్లవి అంటేనే మేకప్ వాడదు, పైగా న్యాచురల్ బ్యూటీ. అయితే, ఆమె శ్యామ్ సింగరాయ్ సినిమాలో దేవదాసి పాత్రలో నటించింది. చాలా సాదాసీదాగా కనిపించింది. దాంతో తమిళనాడులోని ఓ పత్రికలో సాయి పల్లవి గురించి ప్రస్తావిస్తూ దేవదాసి పాత్రలో ఆమె అసలు బాగాలేదు అంటూ.. సాయిపల్లవి అసలు అందంగా ఉండదు అంటూ ఓ వార్తను రాశారు. ఈ వార్త పై సాయి పల్లవి అభిమానులు నిరసన కూడా వ్యక్తం చేశారు.

Sai Pallavi

అయితే, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై కూడా సాయిపల్లవి పై వచ్చిన ఈ వార్త పై స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు. తమిళ ఛానల్‌ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమిళిసై మాట్లాడుతూ.. ”హీరోయిన్ సాయిపల్లవి పై జరిగిన బాడీ షేమింగ్‌ నన్ను ఎంతగానో బాధించిన మాట వాస్తవం. అసలు సమాజంలో ఇది చాలా తప్పు. గతంలో నా రూపాన్ని కూడా చూసి బాడీ షేమింగ్‌ చేసి ట్రోల్ చేసిన సంఘటనలు ఉన్నాయి.

Also Read: మీకు కంటి సమస్యలా ? ఐతే ఇవి మీ కోసమే !

నేను ఆ సమయంలో నన్ను అలా ఎందుకు చేస్తున్నారని చాలా తీవ్రంగా బాధపడేదాన్ని. అయితే, నా ప్రతిభతో, నా శ్రమతో ఆ మాటలను లెక్కచేయకుండా.. అలాంటి నెగిటివ్ కామెంట్స్‌ పట్టించుకోకుండా ముందుకు సాగాను. కానీ, ఎవరైనా ఏదొక సమయంలో అలాంటి మాటల బారిన పడకుండా ఉండలేరు. మనమేమీ మహాత్ములం కాదు కదా. కానీ, నాపై చేసిన కామెంట్స్‌ను నేను పట్టించుకోలేదు. కానీ ఆ ట్రోలింగ్‌ వల్ల ఎవరైనా కచ్చితంగా బాధపడతారు.

Sai Pallavi

అయినా, పొట్టిగా, నల్లగా, నాలాంటి జుట్టుతో పుట్టడం మన తప్పు ఎలా అవుతుంది ? చూడగలిగితే.. అన్నింటిలోనూ అందం ఉంటుంది. కాకి పిల్ల కాకికి ముద్దు. కాకి తన పిల్లను నల్లగా ఉందని వదిలిపెడుతుందా ? ప్రాణం పోయినా ఆ పని చేయదు. మహిళలు బాడీ షేమింగ్‌ కు గురవుతారు, కానీ పురుషులకు మాత్రం అలాంటి మాటలు ఎదురవవు. మన సమాజం.. 50 ఏళ్ల వయసులో ఉన్న పురుషులను కూడా యువకులు గానే చూస్తోంది.

అదే స్త్రీలను మాత్రం అలా ఎన్నటికీ చూడలేదు. స్త్రీల ఎదుగుదలకు ఇలాంటివన్నీ చూపించి మహిళలను బాధపెడుతూ వారి ఎదుగుదలను తగ్గించడానికి ఈ సమాజం ప్రయత్నిస్తూనే ఉంది’ అని తమిళిసై ఎమోషనల్ అవుతూ తీవ్రంగా స్పందించారు.

కాగా తమిళిసై తాజాగా సాయి పల్లవి పై తమిళ ఛానల్ తో మాట్లాడిన ఆ టీవీ క్లిప్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఇక నుంచి అయినా మహిళలను బాడీ షేమింగ్ చేయడం ఆపేయండి అని కోరారు. ఈ విషయంలో ఆమెను ప్రస్తుతం నెటిజన్లు అందరూ అభినందిస్తున్నారు.

Tags