Rajamouli: దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా కీర్తిని చాటి చెప్పిన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. ‘బాహుబలి’ సినిమాతో ఇండియన్ సినిమా అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాడు. ఆయన దర్శకత్వలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం ప్రస్తుతం సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆయనతో సినిమా చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీల నటీనటులు ఎదురు చూస్తున్నారు. ఏదేని చిన్న పాత్ర అయినా సరే ఏళ్ల టైం ఇచ్చేందుకు మేం రెడీ అని అంటున్నారు. కాగా, ఈయనకు కొన్నేళ్ల కిందట ఓ టాలీవుడ్ స్టార్ హీరో నో చెప్పారట. ఆయన ఎవరు? ఇంతకీ అది ఏ సినిమా అనేది తెలుసుకుందాం.

కొత్త ఆలోచనలకు రూపమిస్తూ విజ్యువల్ స్టోరి టెల్లర్ గా పేరు గాంచిన రాజమౌళి.. వెండితెరపైన తనదైన శైలిలో అద్భుతమైన చిత్రాలను ఆవిష్కరిస్తాడు.ఇక ఈయన సినిమా వస్తుందంటే చాలు.. కంపల్సరీగా థియేటర్స్ కు వెళ్లి చూడాల్సిందే అనేంతల ప్రేక్షకులు అనుకుంటుంటారు కూడా. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కెరీర్ ఎలా మారిపోయిందో అందరికీ తెలుసు. అప్పటి వరకు టాలీవుడ్ రెబల్ స్టార్ గా ఉన్న ఆయన.. ఆ చిత్రం తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
Also Read: భోజనం చేసిన తరువాత పొరపాటున కూడా ఈ పదార్థాలు తినకూడదు తెలుసా?
ఇప్పటి వరకు ఆయన 12 సినిమాలు తెరకెక్కించాడు. కాగా, అన్ని చిత్రాలు కూడా బాక్సాఫీసు వద్ద విజయాలే సాధించాయి. అపజయం ఎరుగని దర్శకుడిగా ఆయనకు పేరుంది. అయితే, కలెక్షన్స్ పరంగా ఆయన చిత్రాల్లో కొంత తక్కువ కలెక్షన్స్ అందించిన మూవీగా ‘సై’ ఉంది. నిజానికి ఈ చిత్రాన్ని కూడా టాలీవుడ్ స్టార్ హీరోతో చేయాలని జక్కన్న భావించాడట. కానీ, ఆ హీరో మాత్రం స్టోరి విన్నాక నో చెప్పేశాడని టాక్. తాను ఎంతో నమ్మకంగా వెళ్లి స్టార్ హీరోకు స్టోరి నెరేషన్ ఇస్తే.. అందులోని స్టోరి గురించి డిస్కషన్ చేసి ఆ కథానాయకుడు నిరాకరించాడని సమాచారం. అలా ఆ స్టోరి యంగ్ హీరో నితిన్ వద్దకు వెళ్లింది.

ఈ చిత్రం కూడా బ్లాక్ బాస్టర్ గానే నిలిచింది. కానీ, రాజమౌళి మిగతా చిత్రాలతో పోలిస్తే అంతగా కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. ఈ చిత్ంరలో రగ్బీ గేమ్ గురించి ప్రేక్షకులకు రాజమౌళి పరిచయం చేశాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరిలో బలమైన విలనిజం పెట్టి.. స్టోరిని కమర్షియల్ చేసి చక్కగా మూవీని తీశాడు రాజమౌళి. ఈ పిక్చర్‌లో హీరో నితిన్ కు జోడీగా జెనీలియా నటించింది.
[…] […]
[…] OKtelugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా కన్నడలో విడుదల చేసిన తొలి నాలుగు రోజుల్లోనే రూ.40 కోట్ల కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘కే3 కోటికొక్కడు’. రెండు విభిన్న పాత్రలలో కథానాయకుడిగా సుదీప్, హీరోయిన్స్ గా మడోన్నా, శ్రద్ధాదాస్ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న తెలుగులో విడుదల చేయనున్నట్లు చిత్ర సిబ్బంది తెలిపింది. […]
[…] Cinema Gossips: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్’ షో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ షో సక్సెస్ వెనుక బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని నందమూరి కష్టం కూడా ఉందని షో రైటర్ మచ్చ రవి తెలిపారు. షోలో బాలయ్యను కొత్తగా చూపేందుకు తేజస్విని చాలా రీసెర్చ్ చేశారని చెప్పారు. ‘అన్‌స్టాపబుల్’ టీమ్‌తో పనిచేస్తూ బాలయ్య లుక్, కాస్ట్యూమ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. […]
[…] Narendra Modi: మన దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ‘మన్ కీ బాత్’ ప్రసంగం దేశవ్యాప్తంగా బాగా హైలైట్ అవుతున్న సంగతి అందరికీ విదితమే.ఆయన మాటలను ప్రజలు రేడియోల్లో, టీవీల్లో వింటుంటారు కూడా. కాగా, ఈ సారి ‘మన్ కీ బాత్’ మాటల్లో మోడీ అవినీతి గురించి మాట్లాడారు. దేశానికి పట్టిన పీడ అవినీతి అని, దానిని వదిలించుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. కాగా, ఏడేళ్ల కాలంలో మోడీ అవినీతి కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా పలువురు ప్రశ్నిస్తున్నారు. […]