ప్రభాస్ ను వివాదాల్లోకి నెట్టిన సైఫ్ అలీ ఖాన్ !

రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించనున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’ మొదలుకాక ముందే వివాదాల్లోకి వెళ్ళిపోయింది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ అనుకున్నారు. అయితే ప్రస్తుతం హిందుత్వ అభిమానులు, రామభక్తులు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రావణ పాత్రధారి సైఫ్ ముంబై మిర్రర్ పత్రికతో మాట్లాడుతూ వివాదానికి కారణమయ్యాడు. ఈ సినిమాలో రావణుడిలోని మానవీయ కోణాన్ని చూపించున్నట్టు.. అనగా, ఓ రాక్షసుడిగా కాకుండా మనిషిగా చిత్రీకరించడమే కాదు, సీతమ్మను ఎత్తుకుపోవడాన్ని […]

Written By: admin, Updated On : December 6, 2020 4:07 pm
Follow us on


రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించనున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’ మొదలుకాక ముందే వివాదాల్లోకి వెళ్ళిపోయింది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ అనుకున్నారు. అయితే ప్రస్తుతం హిందుత్వ అభిమానులు, రామభక్తులు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రావణ పాత్రధారి సైఫ్ ముంబై మిర్రర్ పత్రికతో మాట్లాడుతూ వివాదానికి కారణమయ్యాడు. ఈ సినిమాలో రావణుడిలోని మానవీయ కోణాన్ని చూపించున్నట్టు.. అనగా, ఓ రాక్షసుడిగా కాకుండా మనిషిగా చిత్రీకరించడమే కాదు, సీతమ్మను ఎత్తుకుపోవడాన్ని కూడా అతని కోణంలో కరెక్ట్ అనేవిధంగా ఉంటుందని సైఫ్ చెప్పుకొచ్చాడు.

Also Read: మోనాల్ కోసం అవినాష్‌ బలి.. బిగ్ బాస్ పక్షపాత ధోరణి !

సైఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు అర్ధం.. శూర్ఫణఖకు లక్ష్మణుడు చేసిన అవమానానికి ప్రతీకారంగా రావణుడు సీతను ఎత్తుకుపోవడం సబబే అన్నట్టుగా తయారైంది ఈ వ్యవహారం. దాంతో అప్పుడే ఈ సినిమా కొన్ని విమర్శలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిపొయింది. నిజానిజాలు పక్కన పెడితే.. మన దేశంలో రాముడిని దేవుడిగా, రావణుడిని దుర్మార్గుడు‌గా భావిస్తుంటే… దానికి భిన్నంగా సైఫ్ కామెంట్స్ చేయడం ఏమి బాగాలేదని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అయితే రావణుడు చాలామంది దృష్టిలో దుర్మార్గుడు ఏమీ కాదు, పైగా పూజనీయుడు కూడా.

Also Read: పవన్ ‘వకీల్ సాబ్’ రిలీజ్ ఎప్పుడంటే !

విచిత్రం ఏమిటంటే.. అనేకచోట్ల రావణుడికి గుళ్లు కూడా ఉన్నాయి. తమిళనాడు, కేరళ దక్షిణ ప్రాంతాల్లో రావణుడిని కూడా దేవుడిగా ఆరాధిస్తుంటారు. ఎన్టీఆర్ వంటి మహానటులు రావణుడికి హీరోయిజం ఆపాదించి మరీ సినిమాలు తీశారు అంటే.. దానికి కారణం రావణుడిది వైరభక్తి అనే. అంటే దేవుడిని వేగంగా చేరుకోవడానికి అవలంబించే భక్తి అన్నమాట. అంత గొప్ప శివ భక్తుడు కాబట్టే రావణుడు పాత్ర ప్రత్యేకమైనది. ఏది ఏమైనా ఈ అంశం చాలా సున్నితమైనది అనే చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్