Saif Ali Khan loses Rs 15000 crores: అఖండ భారత దేశాన్ని వందల ఏళ్లు రాజులు పాలించారు. బ్రిటిష్ పాలనకు ముందు వరకు హిందు రాజులు, తర్వాత ఇస్లాం రాజులు భారత దేశాన్ని రాజ్యాలుగా విభజించి పాలించారు. ముస్లింలు సంస్థానాలుగా ఏర్పాటు చేశారు. బ్రిటిష్ పాలనలో ఈ రాజులు అంతరించిపోయారు. ఉన్నవారు బ్రిటిషర్స్‌కు అనుకూలంగా వ్యవహరించారు. అయితే ఈ రాజుల ఆస్తులు ఇప్పటికీ భారత్‌లో ఉన్నాయి. వారి వారసులు ఇప్పుడు ఆస్తుల కోసం కొట్లాడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ వివాదం కూడా ఇలాంటిదే. భోపాల్ నవాబ్ హమీదుల్లా ఖాన్ ఆస్తుల చుట్టూ దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం, ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్, ముస్లిం పర్సనల్ లా మధ్య చట్టపరమైన సంక్లిష్టతలను హైలైట్ చేస్తోంది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల రూ.15 వేల కోట్ల విలువైన ఈ ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా గుర్తించి, సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది.
భోపాల్ రాజవంశం చరిత్ర..
భోపాల్ రాజ్యం చివరి నవాబ్ హమీదుల్లా ఖాన్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అబిదా సుల్తాన్ పాకిస్తాన్‌కు వలస వెళ్లగా, సజీదా సుల్తాన్ నవాబ్ ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీని వివాహం చేసుకుంది. వీరి కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (టైగర్ పటౌడీ), సినీ నటి షర్మిలా టాగూర్‌ను వివాహం చేసుకున్నాడు. వీరి పిల్లలు సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్, సబా అలీ ఖాన్. 1980ల నుంచి ఈ ఆస్తి వివాదం కొనసాగుతోంది, అబిదా సుల్తాన్ తన ఆస్తి హక్కులను కాజేశారని ఆరోపిస్తూ ఒక పుస్తకం కూడా రాసింది. అబిదా సుల్తాన్ కుమారుడు షహారియర్ మహ్మద్ ఖాన్ 1990లో న్యాయ పోరాటం ప్రారంభించాడు. సైఫ్ అలీ ఖాన్ 2005లో కోర్టును ఆశ్రయించి, తాత్కాలికంగా అనుకూల తీర్పు పొందాడు.
వివాద కారణం..
అబిదా సుల్తాన్, ఆమె వారసులు (షహారియర్ మహ్మద్ ఖాన్) ముస్లిం పర్సనల్ లా ప్రకారం తమ హక్కును డిమాండ్ చేశారు. సజీదా సుల్తాన్ వారసులు (సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్, సబా అలీ ఖాన్) భోపాల్ సింహాసన వారసత్వ చట్టం 1949 మెర్జర్ ఒప్పందం ఆధారంగా ఆస్తి తమకే చెందుతుందని వాదిస్తున్నారు.
Also Read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్ ఇది.. ఒక్కరోజు బస చేయాలంటే ఆస్తులమ్ముకోవాలి.. అప్పులూ చేయాలి!
ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ నేపథ్యం..
1968లో రూపొందించిన ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్, భారతదేశం నుంచి పాకిస్తాన్ లేదా చైనాకు వలస వెళ్లిన వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అధికారం ఇస్తుంది. ఈ కేసులో, భోపాల్ నవాబ్ హమీదుల్లా ఖాన్ పెద్ద కుమార్తె అబిదా సుల్తాన్ 1950లో పాకిస్తాన్‌కు వలస వెళ్లడం వల్ల ఆమె ఆస్తి హక్కులు ఎనిమీ ప్రాపర్టీగా గుర్తించబడ్డాయి. ఈ చట్టం ప్రకారం, ఈ ఆస్తులు భారత ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉంది.
చట్టపరమైన ప్రభావం..
2014లో కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి చర్యలు చేపట్టింది. సైఫ్ అలీ ఖాన్ 2015లో ఈ నిర్ణయాన్ని సవాల్ చేసి తాత్కాలిక స్టే పొందినప్పటికీ, 2024లో హైకోర్టు ఈ స్టేను ఎత్తివేసింది, ఆస్తులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు మార్గం సుగమం చేసింది.
ముస్లిం పర్సనల్ లా ఏం చెబుతుంది…
ముస్లిం పర్సనల్ లా ప్రకారం, ముస్లిం వ్యక్తి ఆస్తులు వారి చట్టపరమైన వారసులందరికీ సమానంగా విభజించబడతాయి, వారు ఎక్కడ నివసిస్తున్నా సరే. నవాబ్ హమీదుల్లా ఖాన్ ముగ్గురు కుమార్తెలు అబిదా సుల్తాన్, సజీదా సుల్తాన్, రబియా సుల్తాన్‌కు ఆస్తిలో సమాన హక్కులు ఉండాలి. అయితే, 1962లో భారత ప్రభుత్వం సజీదా సుల్తాన్‌ను ఏకైక వారసురాలిగా గుర్తించింది. ఇది వివాదానికి దారితీసింది.
Also Read: ఏందయ్యా ఇదీ.. రష్మిక ఇలా తయారైందేంటి? షాకింగ్ లుక్
ఎనిమీ ప్రాపర్టీగా గుర్తింపు..
2024లో మధ్యప్రదేశ్ హైకోర్టు, రూ.15 వేల విలువైన భోపాల్ రాజవంశ ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా గుర్తించింది. 2015లో సైఫ్ అలీ ఖాన్ పొందిన స్టేను ఎత్తివేసి, కేసును ట్రయల్ కోర్టుకు తిరిగి పంపింది, ఒక సంవత్సరంలో తీర్పు ఇవ్వాలని ఆదేశించింది. సైఫ్ కుటుంబం అప్పీల్ దాఖలు చేయకపోవడంతో, ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉంది.
