Bigg Boss Cheat: బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినీ, టీవీ రంగానికి చెందిన వారే ఈసారి కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. మొత్తం 21 మంది హౌస్ లోకి వెళ్లడంతో సందడిగా మారింది. ఇప్పటికే కొందరు కంటెస్టెంట్లు తమ ఫర్ఫామెన్స్ చూపిస్తున్నారు. బిగ్ బాస్ ఇచిన్న టాస్క్ లను పూర్తి చేసేందుకు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ షో పై ఎప్పటిలాగే కొన్ని వర్గాల నుంచి విమర్శలు మొదలయ్యాయి. గతంలోనూ షో నిర్వాహకులపై కొందరు కామెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు కంటెస్టెంట్ల సెలక్షన్ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. అవేంటో చూద్దాం..?

బిగ్ బాస్ తెలుగు ఇప్పటి వరకు 5 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఐదు సీజన్లలో సినీ, టీవీ ఇండస్ట్రీల నుంచే కాకుండా ఇతర రంగాల్లో ప్రతిభ సాధించిన వారిని హౌస్ లోకి వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. అయితే కొందరు సినిమావాళ్ల కోసమేనా బిగ్ బాస్ అని విమర్శలు చేశారు. దీంతో కొన్ని రోజుల కింద బిగ్ బాస్ నిర్వాహకులు ఈసారి ఇద్దరు కామన్ మేన్స్ కూడా ఉంటారని ప్రచారం చేశారు. అయితే ఆ కామన్ మ్యాన్స్ ఎవరా..? అని ఇన్నిరోజులు ఎదురుచూశారు. అంతేకాకుండా ఈ ఆదివారం షో ప్రారంభంలో ఈ ఇద్దరు ఎవరనే విషయంపై చాలా మంది ఆసక్తిగా ఉన్నారు.
అయితే టీవీ నటులు, యాంకర్లు, యూట్యూబ్ స్టార్లు తప్ప ఇందులో కామన్ మ్యాన్ ఎవరూ కనిపించలేదు. కొన్నిరోజుల కింద బిగ్ బాస్ చెప్పినట్లుగా కామన్ మ్యాన్ ఎవరూ లేరని అర్థమైపోయింది. దీంతో సోషల్ మీడియా వేదికగా కొందరు విమర్శల దాడి మొదలు పెట్టారు. ఇద్దరు కామన్ మ్యాన్ ఉంటారని అన్నారు కదా..? వారెక్కడా..? అని ప్రశ్నిస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి మొత్తం 21 మంది కంటెస్టెంట్లు వెళ్లారు. అందులో ప్రతీ ఒక్కరు సినీ ఇండస్ట్రీకి చెందిన వారే ఉన్నారు. కామన్ మ్యాన్ అంటూ ఎవరూ లేరు. దీంతో బిగ్ బాస్ టీం మాట ఇచ్చి మరిచిపోయింది.. అని కామెంట్స్ పెడుతున్నారు.
ఇక బిగ్ బాస్ షో నిర్వహణపై కమ్యూనిస్టు నాయకుడు నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ షో అని మనుషులను జంతువుల్లాగా చూస్తున్నారని ఆరోపించారు. వారు చెప్పిన విధంగా ఆడించేందుకు ఫోర్స్ చేస్తున్నారని అన్నారు. అయితే గతంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చాయి. కానీ బిగ్ బాస్ టీం పట్టించుకోలేదు. అంతేకాకుండా కొందరి విమర్శల ద్వారా షో నిర్వహణ ఆగదని అన్నారు. బిగ్ బాస్ షో టీవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వారికి వినోదం పంచడానికి ఇలాంటి కొత్త కార్యక్రమాలు చేపట్టారని.. ఇదంతా కామన్ అని గతంలో కొందరు వ్యాఖ్యానించారు.

అయితే సీజన్ 6 పూర్తయ్యేసరికి బిగ్ బాస్ ఇంకెన్ని విమర్శలు ఎదుర్కుంటోందననే చర్చ సాగుతోంది. నాని హోస్ట్ గా వ్యవహరించిన సమయంలో కొందరికి మాత్రమే మద్దతు పలికాడని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. ఆ తరువాత హోస్ట్ గా నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్, నాని, నాగార్జున తప్ప మరెవరూ హోస్ట్ గా రావడం లేదు. ఇతరులకు కేటాయిస్తే విమర్శల పాలవుతామని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కానీ మరో వైపు నుంచి కూడా బిగ్ బాస్ కు విమర్శలు తప్పడం లేదు. మరి షో నిర్వాహకులు ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇస్తారో చూడాలి.