Homeఎంటర్టైన్మెంట్Sai Pallavi : సాయి పల్లవిని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టింది ఎవరు? ఓపెన్ గా...

Sai Pallavi : సాయి పల్లవిని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టింది ఎవరు? ఓపెన్ గా చెప్పేసిన ఫిదా బ్యూటీ!

Sai Pallavi : హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర హీరోయిన్లకి ఆమె చాలా భిన్నంగా ఉంటారు. మేకప్ వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. సహజంగానే అందంగా కనిపిస్తుంది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కట్టు , బొట్టు విషయంలో చాలా పద్ధతిగా ఉంటుంది. గ్లామర్ షో కి దూరంగా ఉండే సాయి పల్లవి వరుస సినిమాలతో గ్లామర్ ఫీల్డ్ లో దూసుకుపోతుంది. సౌత్ టు నార్త్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. అయితే ఆమెను పెళ్లి చేసుకోమని ఒకరు టార్చర్ చేశారట. ఆ వివరాల్లోకి వెళితే ..

మలయాళ చిత్రం ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది సాయి పల్లవి. ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అనంతరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాతో తెలుగు ఆడియన్స్ ని పలకరించింది. సాయి పల్లవి నటనకు, డాన్సులకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఫిదా సక్సెస్ నేపథ్యంలో తెలుగులో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో చందు మొండేటి దర్శకత్వంలో ‘ తండేల్ ‘ చిత్రం చేస్తుంది. నాగ చైతన్య హీరోగా నటిస్తున్నాడు. నాగ చైతన్య హీరో కాగా ఎమోషనల్ లవ్ డ్రామాగా రూపొందిస్తున్నారు. బాలీవుడ్ లో నిర్మిస్తున్న రామాయణంలో సీత పాత్రలో నటిస్తుంది. మరోవైపు తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న అమరన్ సినిమా చేస్తుంది. కమల్ హాసన్ ఈ మూవీ నిర్మాత కావడం విశేషం. ఇది ఇలా ఉంటే .. ఆమెను పెళ్లి చేసుకోమని చాలా ఇబ్బంది పెట్టారట.

ఓ సందర్భంలో సాయి పల్లవి ఈ విషయాన్ని బయట పెట్టింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. కరోనా సమయంలో లాక్ డౌన్ కావడంతో నేను ఇంట్లోనే ఉన్నాను. ఆ టైం లో నన్ను మా పేరెంట్స్ పెళ్లి చేసుకోమని చాలా టార్చర్ చేశారు. కజిన్స్ అందరికీ పెళ్లి అయిపోవడం .. నాకు ఇంకా పెళ్లి కాకపోవడంతో చేసుకోమని బలవంతం పెట్టారు అని చెప్పుకొచ్చింది.

అయితే సాయి పల్లవి తాను కెరీర్ లో ఇంకా ఏమీ సాధించలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకోలేను అని గట్టిగా చెప్పిందట. కరోనా సమయం ముగిసాక మళ్లీ సినిమాల్లో బిజీ కావడంతో ఇక పెళ్లి ప్రస్తావన రాలేదట. అయితే ఆమె లైఫ్ లో అనుకున్నది సాధించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని. తల్లిదండ్రులు సెలెక్ట్ చేసిన అబ్బాయినే వివాహం చేసుకుంటానని సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version