Sai Pallavi : కొంతమంది హీరోయిన్స్ కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తుంటారు. సన్నివేశం ఎంత డిమాండ్ చేసిన హద్దులు మీరిన రొమాన్స్ సినిమాలు చేయడానికి అసలు ఇష్టపడరు. అందాల ఆరబోతల అయితే ఆమడ దూరంలో ఉంటారు. ఒకవేళ అలాంటివి చేస్తేనే సినిమా అవకాశాలు ఇస్తామంటే సినీ ఇండస్ట్రీ నే వదిలి వెళ్లిపోతుంటారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు సాయి పల్లవి (Sai Pallavi|). కెరీర్ ప్రారంభం నుండి ఈమె ఫిల్మోగ్రఫీ ఒకసారి చూస్తే, కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ వచ్చింది. రొమాన్స్ సన్నివేశాలకు దూరం, అదే విధంగా రీమేక్ సినిమాలకు కూడా. తనకు ఇష్టం లేకపోతే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సినిమాని సైతం రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు ఇండస్ట్రీ లో ఎక్కడుంటారు చెప్పండి?, అందుకే సాయి పల్లవి కి యూత్ ఆడియన్స్ లో అంతటి క్రేజ్ ఉంటుంది. ఆమె సింప్లిసిటీ కి అందరూ అలా ఫిదా అయిపోతుంటారు.
అయితే సాయి పల్లవి లో కూడా మార్పులు వస్తున్నాయా..?, మారుతున్న ఆడియన్స్ అభిరుచ్చి కి తగ్గట్టు ఆమె కూడా మారిపోతుందా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. కారణం ఆమె ప్రముఖ తమిళ హీరో శింబు సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించడం వల్లే. పూర్తి వివరాల్లోకి వెళ్తే, శింబు త్వరలోనే ‘పార్కింగ్ ‘(parking) మూవీ ఫేమ్ రాజ్ కుమార్ తో ఒక సినిమా చేయనున్నాడు. డాన్ పిక్చర్స్ పథకం పై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని శింబు పుట్టినరోజు నాడు విడుదల చేయగా అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత శింబు(Silambarasan TR) నుండి యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతుందని అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించడానికి సాయి పల్లవి అంగీకారం తెలిపినట్టు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం.
శింబు సినిమాలో హీరోయిన్ రోల్ అంటే కచ్చితంగా ఆయనతో రొమాన్స్ సన్నివేశాలు చేయాల్సిందే. ఆయన గత చిత్రాలన్నీ చూసిన వారికి ఈ విషయం అర్థం అవుతుంది. కానీ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి వస్తుందని ‘అర్జున్ రెడ్డి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని కూడా వదిలేసుకున్న సాయి పల్లవి, ఇంతటి రొమాంటిక్ హీరో తో నటించడానికి ఎలా ఒప్పుకుంది?, అంటే ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి సిద్దమైనట్టేనా?, లేకపోతే శింబు రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం లో ఆమెకు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కిందా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. సాయి పల్లవి ఒక సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఒప్పుకుందంటే, కచ్చితంగా ఆ చిత్రంలో ఎదో విశేషం ఉన్నట్టు, అదే విధంగా ఆమె పాత్ర చాలా బలంగా కూడా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా కూడా ఆ రెండు క్యాటగిరీలలో ఎదో ఒక క్యాటగిరి కి సంబంధించిన సినిమా అయ్యుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.