Sai Pallavi: హీరోయిన్స్ లో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నటి సాయి పల్లవి. ఇటీవల ఇండస్ట్రీ లోకి వచ్చి సూపర్ హిట్స్ కొట్టి, ట్రెండింగ్ లో ఉన్న కొంతమంది హీరోయిన్స్ తో పోలిస్తే ఈమె గొప్ప అందగత్తె ఏమి కాదు. చాలా సింపుల్ గా ఉంటుంది, మన పక్కింటి అమ్మాయి లాగా ఉంటుంది. కానీ ఈమెలో ఉన్న టాలెంట్ ఇండస్ట్రీ లో ఏ హీరోయిన్ కి కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. డ్యాన్స్ పరంగా, యాక్టింగ్ పరంగా సాయి పల్లవి వేరే లీగ్ అని చెప్పొచ్చు. ఈమధ్య కాలం లో కొత్త హీరోయిన్స్ టాప్ హీరోల సినిమాల్లో అవకాశం వస్తే చాలు, అదృష్టం లాగా భావిస్తూ ఉంటారు. ఆ క్రమం లో స్క్రిప్ట్ ఏంటి?, తమ పాత్ర ప్రాధాన్యత ఏమిటి? అనేది కూడా చూసుకోకుండా ఎడాపెడా సినిమాలు చేసేస్తూ ఉంటారు.
కానీ సాయి పల్లవి అలాంటి హీరోయిన్ మాత్రం కాదు, ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఆమెకి స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తుంది. లేకపోతే నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. అందుకే సాయి పల్లవి సినిమాల్లో నటనకి గొప్ప ప్రాధాన్యత ఉంటుంది. రీసెంట్ గా విడుదలను సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘అమరన్’ చిత్రం అందుకు ఒక ఉదాహరణ. ఈ చిత్రాన్ని చూసి బయటకి వచ్చిన ప్రతీ ఒక్కరు సాయి పల్లవి నటన గురించి ప్రత్యేకించి మాట్లాడారు. అలా ఉంటుంది సాయి పల్లవి స్క్రిప్ట్ ఎంపిక. ఆమె ఒక సినిమాలో నటిస్తుంది అంటే చాలు, ఆ సినిమా ఫలితం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, కచ్చితంగా బాగుంటుంది అనే గుర్తింపు ని ఆడియన్స్ లో ఆమె సంపాదించుకుంది. అందుకే సాయి పల్లవి అంటే అంత ప్రత్యేకం. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమె సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది అంటూ ఒక వార్త వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఆమె నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో హీరో రామ్ చరణ్ పాత్ర ఎంత ప్రత్యేకంగా ఉంటుందో, సాయి పల్లవి పాత్ర కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుందట. అయితే రాజమౌళి లాగానే, సుకుమార్ కూడా ఈమధ్య ఒక సిద్ధాంతం ని అనుసరిస్తున్నాడు. తన సినిమాలో పని చేసే హీరో, హీరోయిన్లు, ఆ చిత్రం పూర్తి అయ్యే వరకు మరో చిత్రానికి షిఫ్ట్ అవ్వకూడదు అనే రూల్ చాలా గట్టిగా పెట్టాడు సుకుమార్. హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోతే పట్టించుకోడు కానీ, హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉంటే మాత్రం కచ్చితంగా ఆయన రూల్ ని పాటించాల్సిందే. కానీ సాయి పల్లవి మాత్రం అలాంటి రూల్స్ పెడితే నాకు వర్కౌట్ అవ్వదు అని నిర్మాతలకు చెప్పేసిందట. అంతే కాదు, ఈ సినిమాలో నటించేందుకు ఆమె 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.