https://oktelugu.com/

Sai Pallavi : అర్జున్ రెడ్డి మూవీకి హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ సాయి పల్లవేనా.? తను ఆ పాత్రను ఎందుకు రిజక్ట్ చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వస్తున్న చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : February 5, 2025 / 10:19 AM IST
    Sai Pallavi

    Sai Pallavi

    Follow us on

    Sai Pallavi : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వస్తున్న చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఏది ఏమైనా కూడా వాళ్లకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు సైతం వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు… ఇక ఇప్పుడున్న ప్రతి హీరో పాన్ ఇండియాలో స్టార్ హీరో గా గుర్తింపు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు సైతం హీరోలను స్టార్ హీరోలుగా మారుస్తూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక దర్శకుడి దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళు ఎంతలా మ్యాజిక్ చేయొచ్చో తెలియాలంటే మనం సందీప్ రెడ్డి వంగ ను చూస్తే అర్థమవుతుంది. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్లో స్టార్ హీరోగా మార్చాడు. ఆయన అనిమల్ సినిమాతో రన్బీర్ కపూర్ ని తొమ్మిది వందల కోట్ల మార్కెట్ సంపాదించుకున్న హీరోగా ఎస్టాబ్లిష్ చేసి వదిలేసాడు. మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో మొదట హీరోయిన్ గా సాయి పల్లవిని అడిగారట. కానీ అప్పుడు ఆమె ఆ సినిమాను చేయలేకపోయింది. కారణం ఏదైనా కూడా ఆమె కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా చేయలేకపోయానని రీసెంట్ గా తండేల్ (Thandel) ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పడం విశేషం…

    మరి ఏది ఏమైనా కూడా విజయ్ అర్జున్ రెడ్డి సినిమాతో ఒక మంచి విజయాన్ని సాధించాడు అంటూ సాయి పల్లవి చెప్పడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చేసి సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ ను కూడా భారీ రేంజ్ లో నిలబడేలా చేశాడు.

    మరి ఇలాంటి సందర్భంలోనే సాయి పల్లవి సైతం ఈ సినిమాను మిస్ చేసుకున్నందుకు కొంతవరకు బాధపడుతున్నాను అంటే చెప్పడం విశేషం… నిజానికి సాయి పల్లవి లాంటి హీరోయిన్ అలాంటి సినిమాల్లో నటించదు. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ కి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా ఆమె డైరెక్టర్ తో డిస్కస్ చేసి తన కండిషన్స్ అన్నింటికీ అంగీకరించిన తర్వాతే ఆమె సినిమాకి కమిట్ అవుతుంది.

    కానీ అర్జున్ రెడ్డి సినిమా బోల్డ్ కంటెంట్ తో వచ్చింది. కాబట్టి ఈ సినిమాలో తను నటించే అవకాశాలు అయితే లేవనే చెప్పాలి. ఇక మొత్తానికైతే సాయి పల్లవిని ఈ సినిమా కోసం తీసుకోవాలి అనుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఈ సినిమాతో ఆయన ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు…