Sai Pallavi: తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం కొత్త తరం భామల రాక ఎక్కువైపోతున్న తరుణంలో ముదురు భామల హడావుడి క్రమంగా తగ్గుతూ వస్తోంది. దాంతో క్రేజీ బ్యూటీలు తమ పరిధులను తమ పద్ధతులను మార్చుకుని ముందుకు పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ లాంటి హోమ్లీ బ్యూటీ ఎక్స్ పోజింగ్ కి గేట్లు ఓపెన్ చేసేసింది.

అలాగే మరో హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా పరిధి దాటి హాట్ ఫోజులతో అవకాశాల కోసం అర్రులు చాస్తోంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి కూడా చేరేలా కనిపిస్తుంది. అయితే.. మొదటి నుంచి ఎక్స్ పోజింగ్ దూరంగా ఉన్న సాయి పల్లవి ఇలా ఉన్నట్టు ఉండి గ్లామర్ వైపు రావడానికి గల కారణం ఒక్కటే కనిపిస్తోంది. ఆమె ఓ వేశ్య పాత్రలో నటించబోతుంది.
పాత్ర వేశ్య కాబట్టి.. ఆ పాత్రలో కొంచెం పరిధి దాటాల్సి ఉంటుంది. అందుకే, సాయి పల్లవి కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఎలాగూ హీరోయిన్ల మధ్య కూడా పోటీ ఎక్కువ అయింది. కాబట్టి.. ఈ పోటీ ప్రపంచంలో తన ఉనికి కాపాడుకోవాలి అంటే.. కచ్చితంగా ఇలాంటి విషయాల్లో మడి కట్టుకుని కూర్చోవడం మంచిది కాదు. సాయి పల్లవి మొత్తానికి షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ‘ఉప్పెన’ సినిమాతో కృతి శెట్టి సడెన్ గా స్టార్ డమ్ సంపాదించి రోజురోజుకూ క్రేజ్ పెంచుకుంటూ పోతూ ఉంది. అలాగే పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల కూడా ఒక్కసారిగా వరుస అవకాశాలను అందుకుంటుంది. నిజానికి టాలీవుడ్ లో ఒక్క సినిమాతోనే ఏకంగా రెండు మూడు సినిమాలలో ఛాన్స్ లు అందుకుని ఫుల్ క్రేజ్ తెచ్చుకోవడం ఈ మధ్య ఈ ఇద్దరి హీరోయిన్స్ కే చెల్లింది.
Also Read: Jabardasth Comedians:జబర్దస్త్ కు రాకముందు ఈ కమెడియన్లు ఏం చేసేవారో తెలుసా..?
అందుకే సాయి పల్లవి లాంటి హీరోయిన్లు ప్రెజెంట్ క్రేజీ హీరోయిన్స్ ను తట్టుకుని నిలబడాలంటే.. గ్లామర్ డోస్ పెంచాల్సిందే. ఎలాగూ సాయి పల్లవికి నటన విషయంలో మంచి మార్కులు పడ్డాయి. తన హస్కీ హావభావాలతోనే ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు బోల్డ్ క్యారెక్టర్స్ తో కూడా ఆకట్టుకుందేమో చూడాలి.
Also Read: Khiladi Movie: మాస్ మహారాజ్ రవితేజ “ఖిలాడి” విడుదల తేదీ ఖరారు…