Sai Pallavi: సాయి పల్లవి(Sai Pallavi) కనిపించడం లేదు. దీంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. మళ్ళీ కనిపించాలని కోరుకుంటున్నారు. సక్సెస్ఫుల్ కెరీర్ లీడ్ చేస్తున్న సాయి పల్లవి కొత్త సినిమాలకు సైన్ చేయకుండా ఫ్యాన్స్ ని నిరాశపరుస్తున్నారు. తమిళ అమ్మాయి అయిన సాయి పల్లవికి తెలుగులోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఆమె సహజ అందాలు, కట్టిపడేసే నటన, కిరాక్ తెప్పించే డాన్స్ కి టాలీవుడ్ ఫిదా అయిపోయింది. తెలుగులో సాయి పల్లవి నటించిన చాలా చిత్రాలు విజయం సాధించాయి. పూర్తిగా నిరాశపరిచిన చిత్రం ఒక్కటి కూడా లేదు. దానికి కారణం ఆమె ఎంచుకునే సబ్జక్ట్స్ గొప్పగా ఉంటాయి. సినిమాలో మేటర్ లో ఉంటేనే సైన్ చేస్తుంది.

సాయి పల్లవి గత మూడు తెలుగు చిత్రాల్లో రెండు సూపర్ హిట్స్. ఒకటి మాత్రం ప్లాప్ ఖాతాలో చేరింది. లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ మంచి విజయాలు నమోదు చేశాయి. అంతకు మించి సాయి పల్లవి అద్భుతమైన పాత్రలు చేశారు. లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో సాయి పల్లవి బాగా వెయిట్ ఉన్న పాత్రలను ఎంచుకొని వాటికి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. విరాట పర్వం మాత్రం నిరాశపరిచింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విరాటపర్వం కమర్షియల్ గా ఆడలేదు.
ఇటీవల ఆమె నటించిన గార్గి విడుదలైంది. సోషల్ సబ్జెక్టుతో తెరకెక్కిన గార్గి లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కింది. సాయి పల్లవి లీడ్ రోల్ చేశారు. సాయి పల్లవికి మార్కెట్ ఉన్న నేపథ్యంలో తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ మూవీ జనాలకు అంతగా ఎక్కలేదు. సాయి పల్లవి తెలుగు స్ట్రెయిట్ మూవీ విరాటపర్వం విడుదలై నెలలు గడుస్తున్నా ఆమె కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో అధికారికంగా ఒక్క సినిమా లేదు. సూపర్ సక్సెస్ రేట్ తో ఫుల్ ఫార్మ్ లో ఉన్న సాయి పల్లవి ఖాళీగా ఉండడం ఊహించని పరిణామం.

ఆమెకున్న డిమాండ్ రీత్యా ఊ… అంటే బ్లాంక్ చెక్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. కానీ సాయి పల్లవి కొత్త చిత్రాల ప్రకటన చేయడం లేదు. ఈ క్రమంలో సాయి పల్లవికి ఏమైంది? ఆమె ఎందుకు సైలెంట్ గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు? అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. సరైన సబ్జక్ట్స్ దొరకడం లేదా? లేదంటే సినిమాలు చేయకూడని నిర్ణయం తీసుకున్నారా? అనే ఆలోచనలో పడ్డారు. స్క్రిప్ట్ లో తన పాత్రకు ప్రాముఖ్యత లేకపోతే సాయి పల్లవి చేయరు. అలాగే స్కిన్ షోకి ఆమడ దూరం. వృత్తిపరమైనవి కావచ్చు, వ్యక్తిగతం కావచ్చు సాయి పల్లవి మాత్రం సినిమాలను దూరం పెట్టారని తెలుస్తుంది.