మెగాస్టార్ ‘వేదాళం’ మాటలు మొదలు !

దర్శకుడు మెహ‌ర్ రమేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమాని చేసే ప్రయత్నంలో ఉన్నాడు. వేదాళం రీమేక్ ను చేయడానికి స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నారు. ఇప్పటికే మెహ‌ర్ ర‌మేష్ చేసిన స్క్రిప్ట్ వర్క్ మెగాస్టార్ కి నచ్చింది. కథలోని మెయిన్ ఎమోషన్స్ ను మెహర్ చాలా బాగా పట్టుకున్నాడు అని.. అలాగే స్క్రిప్ట్ లో డైలాగ్స్ అద్భుతంగా రాసుకున్నాడు అని మెగాస్టార్ స్క్రిప్ట్ ను ఫైనల్ చేశారు. అయితే డైలాగ్స్ బాగున్నా.. మరో వెర్షన్ ను స్టార్ […]

Written By: admin, Updated On : November 15, 2020 5:33 pm
Follow us on


దర్శకుడు మెహ‌ర్ రమేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమాని చేసే ప్రయత్నంలో ఉన్నాడు. వేదాళం రీమేక్ ను చేయడానికి స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నారు. ఇప్పటికే మెహ‌ర్ ర‌మేష్ చేసిన స్క్రిప్ట్ వర్క్ మెగాస్టార్ కి నచ్చింది. కథలోని మెయిన్ ఎమోషన్స్ ను మెహర్ చాలా బాగా పట్టుకున్నాడు అని.. అలాగే స్క్రిప్ట్ లో డైలాగ్స్ అద్భుతంగా రాసుకున్నాడు అని మెగాస్టార్ స్క్రిప్ట్ ను ఫైనల్ చేశారు. అయితే డైలాగ్స్ బాగున్నా.. మరో వెర్షన్ ను స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా చేత రాయించాలని మెహర్ కు మెగాస్టార్ సూచించారట. దాంతో ఈ రోజు మెహర్ రమేష్, సాయి మాధవ్ బుర్రా స్క్రిప్ట్ పై కూర్చున్నారు. సాయి మాధవ్ కి తన పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్న సన్నివేశాలను మెహర్ రమేష్ వివరించారు.

Also Read: తల్లికి వోడ్కా తాగిస్తున్న వర్మ !

ఇక రేపటి నుండి సాయి మాధవ్ డైలాగ్ వెర్షన్ ను మొదలుపెట్టనున్నారు. నిజానికి సాయి మాధవ్ మెగాస్టార్ ప్రస్తుతం చేస్తోన్న మూడు సినిమాల్లో రెండు సినిమాలకి మాటలు రాస్తున్నారు. ఇక సినిమా లేక దాదాపు ఎనిమిది సంవత్సరాల నుండి పూర్తిగా ఇంటికే పరిమితం అయిన మెహ‌ర్ రమేష్ కి మెగాస్టార్ పెద్ద మనసుతో పిలిచి మరీ ఆవకాశం ఇవ్వడం.. మెగా ఫ్యాన్స్ కి షాక్ కి గురి చేసినా.. మెగాస్టార్ గొప్ప మనసుకు వారు ఫిదా అయ్యారు. అయితే గతంలో ఎన్టీఆర్, ప్రభాస్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసినా.. ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయినా మెహర్ రమేష్, ఈ సారి మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.

Also Read: సినిమాలు ఆపేస్తానని చెప్పేవాడట !

ఎట్టి పరిస్థితుల్లోనూ మెగాస్టార్ సినిమా క‌మ‌ర్శియ ల్ గా పెద్ద స‌క్సెస్ చేసి.. తనకు ఉన్న భారీ డిజాస్టర్ల డైరెక్టర్ అనే నేమ్ ను పొగిట్టుకోవడానికి మెహర్ రమేష్ చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం. ఎందుకంటే ఒక డైరెక్టర్ గా మెహర్ రమేష్ కి మంచి టాలెంట్ ఉంది. అందుకే కెరీర్ లో ఒక్క హిట్ లేకపోయినా.. ఎన్టీఆర్ ను రెండు సార్లు డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది, అలాగే ప్రభాస్ ను ఒకసారి డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. అంత గొప్పగా మెహర్ షార్ట్ మేకింగ్ చేయగలడు. మరి ఈ సారి చేయబోయే సినిమాతో మెహ‌ర్ రమేష్ లైఫ్ ఛేంజ్ అవ్వబోతుందేమో చూడాలి. ఎలాగూ మెగాస్టార్ లైఫ్ చేంజింగ్ ఆఫ‌ర్ ఇచ్చారు కాబట్టి.. లైఫ్ ఛేంజ్ అయ్యే అవకాశమే ఎక్కువ.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్