https://oktelugu.com/

Sai Kumar: రాజశేఖర్ కి డబ్బింగ్ చెప్పనన్న సాయి కుమార్, తల్లి తిట్టినా మనసు మారలేదు.. చివరికి ఏమైంది?

టాలీవుడ్ స్టార్స్ లో ఒకరిగా ఫ్యాన్ ఫాలోయింగ్ రాబట్టారు రాజశేఖర్. యాక్షన్ హీరోగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్న రాజశేఖర్, ఎమోషనల్ రోల్స్ లో కూడా ప్రేక్షకులను మెప్పించాడు. అయితే రాజశేఖర్ కి వాయిస్ మైనస్. సాయి కుమార్ డబ్బింగ్ చెప్పేవారు. ఒక దశలో రాజశేఖర్ కి సాయి కుమార్ డబ్బింగ్ చెప్పను అన్నారట.

Written By: , Updated On : March 2, 2025 / 09:55 AM IST
Sai Kumar

Sai Kumar

Follow us on

Sai Kumar: హీరో రాజశేఖర్ వాయిస్ కి ఆయన ఆహార్యానికి సంబంధం ఉండదు. సినిమాల్లో రాజశేఖర్ చేసే పవర్ ఫుల్ రోల్స్, గంభీరమైన వాయిస్ తో చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. ఆయన రియల్ వాయిస్ విన్నప్పుడు ఒకింత ఫన్నీగా ఉంటుంది. అసలు మనం సిల్వర్ స్క్రీన్ పై చూసింది ఈయన్నేనా అనిపిస్తుంది. రాజశేఖర్ తెలుగు అనర్గళంగా మాట్లాడలేడు. ఆయనది తమిళ్ యాక్సెంట్ తో కూడిన తెలుగు. రాజశేఖర్ తెలుగువాడైనప్పటికీ పుట్టి పెరిగింది తమిళనాడులోనే. తండ్రి పోలీస్ ఆఫీసర్ కావడంతో ట్రాన్స్ఫర్స్ ఉండేవట. తమిళ్ మీడియంలో చదువుకున్నారు.

Also Read: రాజమౌళి మహేష్ బాబు ను కొత్త స్టైల్ లోకి మార్చడం వెనక ఇంత కథ ఉందా..?

తమిళ్ మాట్లాడటం, రాయడం చేయగలడు. తెలుగు చదవడం, రాయడం కూడా ఆయనకు రావు. కెరీర్ బిగినింగ్ లో రాజశేఖర్ సొంతగా డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేశాడట. తెలుగు మీద పట్టులేకపోవడంతో పాటు ఆయనకు నత్తి ఉంది. దానితో డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాల్సిందే అని.. సాయి కుమార్ తో చెప్పించారట. ఆయన వాయిస్ రాజశేఖర్ కి సెట్ కావడంతో అప్పటి నుండి రాజశేఖర్ కి సాయి కుమార్ గొంతు అరువిస్తూ వచ్చాడు.

సాయి కుమార్ హీరో కావడంతో ఆయన రాజశేఖర్ కి డబ్బింగ్ చెప్పను అన్నారట. నా వాయిస్ నా బలం, ఇకపై వేరే హీరోలకు నా వాయిస్ ఇవ్వను అన్నారట. దాంతో సుమన్, రాజశేఖర్ వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ కోసం వెతగ్గా.. శ్రీనివాస మూర్తి వాయిస్ సాయి కుమార్ కి దగ్గరగా ఉండటంతో రాజశేఖర్ ఆయన్ని ఎంచుకున్నాడట. శివయ్య సినిమాకు మొదటిసారి శ్రీనివాసమూర్తి రాజశేఖర్ కి డబ్బింగ్ చెప్పాడట. తర్వాత ఒక 10 ఏళ్ళు ఆయనే రాజశేఖర్ సినిమాలకు పని చేశాడట.

రాజశేఖర్ కి డబ్బింగ్ చెప్పను అన్న సాయి కుమార్ పై ఆయన తల్లి కూడా కోప్పడ్డారట. అలా ఎందుకు చేస్తున్నావు, రాజశేఖర్ కి నువ్వు డబ్బింగ్ చెప్పాలని సాయి కుమార్ ని మదర్ తిట్టేవారట. చనిపోయే ముందు కూడా డైరీలో ఆమె ఈ విషయాన్ని రాసుకున్నారట. తర్వాత ఎవడైతే నాకేంటి సినిమాకు రాజశేఖర్ కి సాయి కుమార్ డబ్బింగ్ చెప్పారట. ఈ విషయాలు గతంలో రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

 

Also Read: తెలుగు లో తమిళ్ డైరెక్టర్ల హవా ఎక్కువవుతుందా..?