https://oktelugu.com/

వామ్మో.. సాయితేజ్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..?

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు సాయితేజ్. 2019 సంవత్సరంలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిరోజూ పండగే సినిమాతో హిట్ కొట్టిన సాయిధరమ్ తేజ్ గతేడాది సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. కరోనా విజృంభణ వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా..? అనే సందేహంతో చాలామంది దర్శకనిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి ఆసక్తి చూపలేదు. Also […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 23, 2021 / 12:39 PM IST
    Follow us on

    మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు సాయితేజ్. 2019 సంవత్సరంలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిరోజూ పండగే సినిమాతో హిట్ కొట్టిన సాయిధరమ్ తేజ్ గతేడాది సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. కరోనా విజృంభణ వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా..? అనే సందేహంతో చాలామంది దర్శకనిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి ఆసక్తి చూపలేదు.

    Also Read: నెటిజన్ల ట్రోలింగ్ తో ఫోటో డిలీట్ చేసిన సమంత..?

    అయితే సాయి తేజ్, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను మాత్రం ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే విడుదల చేసి సక్సెస్ ను అందుకున్నారు. వరుస విజయాలతో జోరుమీదున్న సాయితేజ్ ఈ ఏడాది మూడు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సాయితేజ్ దేవాకట్టా దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు రిపబ్లిక్ అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది.

    Also Read: అల్లరోడి ఆశలు ఈ సినిమాపైనే.. కల నెరవేరుతుందా..?

    అయితే సినిమాకు రిపబ్లిక్ టైటిల్ నే ఫైనల్ చేస్తారో లేక మరో టైటిల్ ను ఫైనల్ చేస్తారో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తైందని సమాచారం. ఈ సినిమాతో పాటు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్న మరో సినిమాలో కూడా సాయితేజ్ నటిస్తున్నాడని తెలుస్తోంది. కార్తీక్ దండు ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే పూర్తి కావడంతో పాటు విడుదల కానున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    సాయితేజ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ సినిమా కూడా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా విజయాలను అందుకోవడంతో పాటు వరుసగా సినిమాలను ప్లాన్ చేసుకుంటూ సాయితేజ్ సినిమాసినిమాకు తన మార్కెట్ ను పెంచుకుంటూ ఉండటం గమనార్హం.