https://oktelugu.com/

Sai Dharma Tej Accident Updates: అపోలో ఆస్పత్రికి మెగా ఫ్యామిలీ మెంబర్స్.. సాయిధరమ్ ఆరోగ్యంపై అప్డేట్

Sai Dharma Tej Accident Updates: ‘మెగా’ హీరో సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన మాదాపూర్ తీగల బ్రిడ్జిపై ప్రమాదవశాత్తూ  కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్‌ తేజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలో వెళ్లినట్లు తెలుస్తోంది. నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, చికిత్స నిమిత్తం […]

Written By:
  • NARESH
  • , Updated On : September 11, 2021 / 10:12 AM IST
    Follow us on

    Sai Dharma Tej Accident Updates: ‘మెగా’ హీరో సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన మాదాపూర్ తీగల బ్రిడ్జిపై ప్రమాదవశాత్తూ  కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్‌ తేజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలో వెళ్లినట్లు తెలుస్తోంది. నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, చికిత్స నిమిత్తం సాయిధరమ్‌ తేజ్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

    బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రోడ్డుపై మట్టి ఉండడం.. తడిసి ఉండడంతో బైక్ స్కిడ్ అయ్యిందని తేలింది. బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి సాయిధరమ్ కిందపడిపోయినట్లు మాదాపూర్‌ సీఐ తెలిపారు.

    సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి తెలియగానే అపోలో హాస్పిటల్ కు ఆయన కుటుంబ సభ్యులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, వైష్ణవ తేజ్, అల్లు అరవింద్, చిరంజీవి భార్య సురేఖ, నాగబాబు, త్రివిక్రమ్, హీరో సందీప్ కిషన్, నిహారిక, వరుణ్ తేజ్ లు చేరుకున్నారు. సాయిధరమ్ తేజ్ అపస్మారక స్తితిలో ఉన్నాడని..  ప్రమాదం ఏమి లేదని పవన్ కళ్యాణ్ తెలిపారు.

    ప్రస్తుతం చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి యాజమాన్యం తాజాగా సాయిధరమ్ తేజ్ ఆరోగ్య  పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. అన్ని మేజర్ అవయవాలు బాగానే పనిచేస్తున్నాయని.. ప్రస్తుతం ఐసీయూలో చికిత్సనందిస్తున్నామని అపోలో వైద్యులు తెలిపారు. దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామని.. ప్రాణాపాయం ఏమీ లేదని.. సేఫ్ అని అపోలో వైద్యులు ప్రకటించారు. రేపు మరో బులిటెన్ విడుదల చేస్తామని అపోలో తెలిపింది.