Homeఎంటర్టైన్మెంట్Sai Dharma Tej Accident: హీరో గాయాలతో ఉంటే.. ఈ ట్విట్టర్ వార్ అవసరమా...

Sai Dharma Tej Accident: హీరో గాయాలతో ఉంటే.. ఈ ట్విట్టర్ వార్ అవసరమా ?

Sai Dharma Tej Accident: Hero is injured, Is this Twitter war necessary

Sai Dharma Tej Accident: సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి, హాస్పిటల్ లో గాయాలతో జాయిన్ అయిన దగ్గర నుంచి, ఎవరికీ వారు వారికి ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తూ పోతున్నారు. దీనికి తోడూ సాయి తేజ్ ప్రమాదానికి అసలు కారణం అతివేగం అంటూ కొన్ని కథనాలు పుట్టించారు. కానీ అతి వేగం కన్నా.. రోడ్డు పై ఇసుక వల్లే బైక్ స్కిడ్ అయింది అంటూ సాయి తేజ్ మిత్రులు సన్నిహితులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.

అసలు నిజం ఏమిటి అనేది త్వరలోనే తేలుతుంది ? ఇప్పటికే పోలీసుల విచారణ మొదలుపెట్టారు. సాయి తేజ్ వేగం పరిమితి స్పీడ్ అయిన 30 కిలోమీటర్లకు మించి వేగం ఉందా? లేదా ? లేక అసలు ఇసుక వల్లే ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణంలో ప్రత్యక్ష సాక్షులను విచారించి అసలు నిజాలను పోలీసులు బయటకు లాగనున్నారు.

కానీ, విచారణకు పూర్తీ కాకముందే టీవీ9తో పాటు మరికొన్ని ఛానెల్స్ కాస్త ఎక్కువ హడావుడి చేస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ విషయంలో నిజంగానే అతిగా నెగెటివ్ ప్రచారం చేశాయి. అందుకే దర్శకుడు హరీష్ శంకర్ టీవీ9 పై సీరియస్ అవుతూ సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు పెట్టారు.

సాయి ధరమ్ తేజ్ కి సంబంధించి నెగిటివ్ వార్తలతో హోరెత్తిస్తున్నారు అంటూ హరీష్ విమర్శలు చేశాడు. టీవీ9 జర్నలిజం విలువలకి దూరంగా ఉంది అని అర్ధం వచ్చేలా హరీష్ కామెంట్స్ చేశాడు. హరీష్ శంకర్ కామెంట్స్ కి టీవి9 ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, హరీష్ ట్వీట్ కి వ్యతిరేకంగా స్పందించారు.

మొత్తానికి వీరిద్దరు మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. సహజంగానే సెలెబ్రిటీల విషయంలో టీవీ ఛానెల్స్ మెయిన్ గా టీవీ9 కాస్త ఎక్కువ హడావిడి చేస్తోంది. అసలు హీరో గాయాలతో ఉంటే.. ఈ ట్విట్టర్ వార్ అవసరమా !!

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version