AP TDP: టీడీపీ ఆరోపణలతో ఇరకాటంలోకి.. షర్మిలపైనే గురి

AP TDP: అధికారం లేకపోయే సరికి టీడీపీ నేతల ప్రవర్తన వింతగా ఉంటోంది. ఎవరిని టార్గెట్ చేయాలో కూడా తెలియని పరిస్థితిలో పడిపోతున్నారు. ప్రతిపక్ష స్థానంలో ఉండడంతో ప్రభుత్వాన్ని విమర్శించడం పరిపాటే. అది సాధారణమే. అందులో తప్పు ఏముండదని అందరు భావిస్తారు. కానీ సీఎం జగన్ చెల్లెలు ప్రస్తావన తెస్తూ మాటిమాటికి ఆమెను టార్గెట్ చేస్తూ విమర్శించడంతో వారి స్థాయి ఏంటో అర్థమైపోతోంది. అధికార పార్టీ వైసీపీపై కావాలనే ఏదో ఒకటి మాట్లాడే సందర్భంలో తప్పులో కాలు […]

Written By: Srinivas, Updated On : September 12, 2021 6:38 pm
Follow us on

AP TDP: అధికారం లేకపోయే సరికి టీడీపీ నేతల ప్రవర్తన వింతగా ఉంటోంది. ఎవరిని టార్గెట్ చేయాలో కూడా తెలియని పరిస్థితిలో పడిపోతున్నారు. ప్రతిపక్ష స్థానంలో ఉండడంతో ప్రభుత్వాన్ని విమర్శించడం పరిపాటే. అది సాధారణమే. అందులో తప్పు ఏముండదని అందరు భావిస్తారు. కానీ సీఎం జగన్ చెల్లెలు ప్రస్తావన తెస్తూ మాటిమాటికి ఆమెను టార్గెట్ చేస్తూ విమర్శించడంతో వారి స్థాయి ఏంటో అర్థమైపోతోంది. అధికార పార్టీ వైసీపీపై కావాలనే ఏదో ఒకటి మాట్లాడే సందర్భంలో తప్పులో కాలు వేస్తున్నారని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది.

తాజాగా అనంతపురంలో జరిగిన రాయలసీమ నేతల సమావేశంలో పార్లమెంట్ ఇన్ చార్జి జేసీ పవన్ రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేసి డోలాయమానంలో పడిపోయారు. జగన్ చెల్లెలు షర్మిలకు కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకపోవడమేమిటని ప్రశ్నించి తన స్థాయి దిగజార్చుకున్నారు. నీటి విషయంలో కేఆర్ఎంబీకి అన్ని హక్కులు ఇచ్చేందుకు కూడా జగన్ పరోక్ష కారణమయ్యారనే ఆరోపణలు చేశారు. దీంతో ఆయన అలా మాట్లాడటంలో ఆయన అమాయకత్వమో లేక తుంటరితనమో అర్థం కావడం లేదని తెలుస్తోంది.

ఇంతకీ షర్మిలను ఎందుకు మధ్యలోకి లాగుతున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. పైగా పోటీ చేయడమంటే తనకే ఇష్టం లేదని పలుమార్లు షర్మిల చెప్పిన విషయం తెలిసినా వారిలో ఇలాంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. షర్మిల టికెట్ ఆశించి భంగపడినా వారు చేసిన విమర్శల్లో అర్థముండేది. కానీ జగన్ పై విమర్శలు చేయకుండా పరోక్షంగా షర్మిలను లాగడం చూస్తుంటే వారిలో అర్థరహితమైన ఆరోపణలు చేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని వైసీపీ నేతలు సైతం సెటైర్లు వేస్తున్నారు.

జల వివాదాల విషయంలో కూడా టీడీపీ నేతల తెలివితక్కువ తనం వల్లే సమస్యలను కొనితెచ్చుకుంటోందని తెలుస్తోంది. విమర్శలు అనేవి సద్విమర్శలుగా ఉండాలే కానీ వేరే వివాదాలకు కేంద్రాలుగా కాకుండా చూసుకోవాల్సిన నేతలు ఏదో మాట్లాడాలనే తపనతో తమ స్థాయిని బయటపెట్టుకుంటూ దిగజారిపోతున్నారు. దీంతో రాష్ర్టంలో ప్రతిపక్ష పార్టీ బలహీనపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా నేతల్లో మంచి ఆలోచన శక్తి పెరిగి ప్రభుత్వంపై సరైన రీతిలో విమర్శలు చేసి పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.