https://oktelugu.com/

Sai Dharam: పెళ్ళికి సిద్ధమైన ధరమ్ తేజ్, మెగా ఫ్యామిలోకి కోడలిగా మరో హీరోయిన్.. రహస్య ప్రేమాయణం బట్టబయలు!

హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కనున్నాడట. ఓ స్టార్ హీరోయిన్ తో రహస్య ప్రేమాయణం జరుపుతున్న యంగ్ హీరో త్వరలో బట్టబయలు చేయనున్నాడట. మెగా ఫ్యామిలీలోకి మరో హీరోయిన్ కోడలిగా వస్తుందనే ప్రచారం టాలీవుడ్ లో ఊపందుకుంది. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

Written By:
  • S Reddy
  • , Updated On : July 22, 2024 / 04:50 PM IST

    Sai Dharam will tie knot with this Star Heroine soon

    Follow us on

    Sai Dharam: హీరోయిన్ ని భార్యలుగా తెచ్చుకునే కల్చర్ టాలీవుడ్ లో అంతకంతకు పెరుగుతుంది. గతంలో కృష్ణ, నాగార్జున, రాజశేఖర్, శ్రీహరి వంటి నటులు తమతో నటించిన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్నారు. ఈ జనరేషన్ స్టార్స్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు హీరోయిన్స్ ని ప్రేమ వివాహాలు చేసుకున్నారు. కాగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే.

    2023 నవంబర్ నెలలో ఇటలీ వేదికగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల వివాహం జరిగింది. మెగా హీరోలందరూ పాల్గొన్న ఈ వివాహం టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యింది. పవన్ కళ్యాణ్ తర్వాత హీరోయిన్ ని వివాహం చేసుకున్న మెగా హీరోగా వరుణ్ తేజ్ రికార్డులకు ఎక్కారు. కాగా మెగా ఫ్యామిలీలోకి మరో హీరోయిన్ కోడలిగా వస్తున్నారనేది లేటెస్ట్ టాక్. ఓ హీరోయిన్ తో కొన్నాళ్లుగా రహస్య ప్రేమాయణం జరుగుతున్న సాయి ధరమ్ తేజ్ ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడట.

    చిరంజీవి చెల్లెలు కుమారుడైన సాయి ధరమ్ తేజ్ పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, ప్రతిరోజూ పండగే వంటి హిట్ చిత్రాలతో టైర్ టూ హీరోల జాబితాలో చేరాడు. కాగా 2021 సెప్టెంబర్ నెలలో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు అంబులెన్స్ కి కాల్ చేయడంతో సాయి ధరమ్ తేజ్ కి ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ ఏడాది పాటు ఇంటికే పరిమితం అయ్యారు. కోలుకున్న తర్వాత విరూపాక్ష టైటిల్ తో హారర్ థ్రిల్లర్ చేశాడు.

    విరూపాక్ష మంచి విజయం సాధించింది. సాయి ధరమ్ తేజ్ కి గొప్ప కమ్ బ్యాక్ ఇచ్చింది. అనంతరం మేనమామ పవన్ కళ్యాణ్ తో బ్రో అనే మల్టీస్టారర్ చేశాడు. ఈ మూవీ సైతం పాజిటివ్ టాక్ దక్కించుకుంది. దర్శకుడు సముద్ర ఖని వినోదయ సిత్తం రీమేక్ గా బ్రో తెరకెక్కించాడు. మాటలు, స్క్రీన్ ప్లే దర్శకుడు త్రివిక్రమ్ అందించారు. ఆ మధ్య సాయి ధరమ్ తేజ్ సంపత్ నంది దర్శకత్వంలో గంజా శంకర్ ప్రకటించారు. ఈ మూవీ పై అప్డేట్ రావాల్సి ఉంది.

    కాగా సాయి ధరమ్ తేజ్ పెళ్లి అంటూ టాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆయన ప్రేమ వివాహం చేసుకుంటున్నారట. అది కూడా తనతో జతకట్టిన ఓ నార్త్ బ్యూటీ అట. ఆమె ఎవరో కాదు మెహ్రీన్ ఫిర్జాడా. ఈ పంజాబీ భామ కృష్ణగాడి ఓ విజయగాథ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. డెబ్యూ మూవీతోనే సూపర్ హిట్ కొట్టింది. ఇక సాయి ధరమ్-మెహ్రీన్ కాంబోలో జవాన్ మూవీ తెరకెక్కింది. వివి వినాయక్ ఈ చిత్ర దర్శకుడు కావడం విశేషం.

    జవాన్ 2017లో విడుదల కాగా మెహ్రీన్ తో సాయి ధరమ్ మరొక చిత్రం చేయలేదు. కాగా మెహ్రీన్-సాయి ధరమ్ కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నారనేది లేటెస్ట్ న్యూస్. ఇక అజ్ఞాత ప్రేమకు తెరదింపి పెళ్లి పీటలు ఎక్కాలని అనుకుంటున్నారట. మెహ్రీన్ తో పెళ్లి పై త్వరలో ప్రకటన రానుందని అంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తోంది.

    కాగా మెహరీన్ 2021లో హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడు భజన్ లాల్ మనవడు భవిష్య బిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. కారణం తెలియదు కానీ ఈ వివాహం రద్దైంది. అనంతరం మరలా ఆమె కెరీర్ పై ఫోకస్ పెట్టింది.