https://oktelugu.com/

Virupaksha Movie Collections: ‘మే డే’ రోజు ప్రభంజనం సృష్టించిన ‘విరూపాక్ష’..ఈ ఒక్క రోజు ఎంత వసూలు చేసిందంటే!

కేవలం ఆదివారం రోజే ఈ సినిమాకి 2 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, మీడియం రేంజ్ హీరో కి 10 వ రోజు కూడా ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది సాధరణమైన విషయం కాదు.ఇక ఈ చిత్రానికి మే 1వ తేదీ 'కార్మికుల దినోత్సవం' అవ్వడం తో ఈ సినిమా వసూళ్లు నిన్న కూడా అద్భుతంగా ఉన్నాయి.

Written By:
  • Vicky
  • , Updated On : May 2, 2023 / 09:35 AM IST
    Follow us on

    Virupaksha Movie Collections: సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విరూపాక్ష’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. విడుదలకు ముందు నుండే భారీ అంచనాలను ఏర్పర్చుకున్న ఈ సినిమా, విడుదల తర్వాత ఆ అంచనాలను మించి ప్రేక్షకులను అలరించడం తో , మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

    అలా ఓపెనింగ్స్ దగ్గర నుండి ఫుల్ రన్ వరకు ఈ సినిమా కి వస్తున్నా వసూళ్లను చూసి ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెడుతున్నారు. వరుసగా పది రోజులు ఆగకుండా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది ఈ చిత్రం. కొత్తగా విడుదలైన అఖిల్ ‘ఏజెంట్’ చిత్రం కూడా భారీ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో ఆడియన్స్ మొత్తం ‘విరూపాక్ష’ చిత్రానికి వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.

    కేవలం ఆదివారం రోజే ఈ సినిమాకి 2 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, మీడియం రేంజ్ హీరో కి 10 వ రోజు కూడా ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది సాధరణమైన విషయం కాదు.ఇక ఈ చిత్రానికి మే 1వ తేదీ ‘కార్మికుల దినోత్సవం’ అవ్వడం తో ఈ సినిమా వసూళ్లు నిన్న కూడా అద్భుతంగా ఉన్నాయి.

    ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ చిత్రానికి నిన్న ఒక్క రోజే కోటి 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలా మొత్తం 11 రోజులకు గాను ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 32 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట, ఓవర్సీస్ మరియు కర్ణాటక ప్రాంతాలు కూడా కలిపితే ఈ సినిమాకి సుమారుగా 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ వర్గాలు.మరి ఫుల్ రన్ లో ఈ సినిమా 50 కోట్ల మార్కుని అందుకుంటుందో లేదో చూడాలి.