Sai Dharam Tej : ప్రముఖ యాంకర్ ఓంకార్(Omkar) నిర్వహించే షోస్ ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్స్ తో ఆయన షోస్ ని డిజైన్ చేస్తూ ఉంటాడు, వాటికి అద్భుతమైన రెస్పాన్స్ కూడా ఆడియన్సు నుండి వస్తూ ఉంటుంది. టెలివిజన్ రంగం లో సెన్సేషన్ సృష్టించిన ఓంకార్, ఇప్పుడు ఓటీటీ లో కూడా తనదైన మార్కుని క్రియేట్ చేసుకున్నాడు. ఆహా మీడియా లో ఆయన నిర్వహిస్తున్న ‘డ్యాన్స్ ఐకాన్ 2′(Dance Ikon 2) ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో, రెండవ సీజన్ ని గ్రాండ్ గా మొదలు పెట్టారు. మొదటి సీజన్ కంటే రెండింతలు ఎక్కువ రెస్పాన్స్ ఈ సీజన్ కి వచ్చింది. ఇప్పుడు ఈ సీజన్ చివరి దశకు చేరుకుంది, త్వరలోనే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
Also Read : సాయి ధరమ్ తేజ్ కి పోలీసులు నోటీసులు..మధ్యలోనే ఆగిపోయిన సినిమా!
ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని ఇటీవలే విడుదల చేయగా, దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) విచ్చేశాడు. ఆయనతో పాటు ఈ షోకి ఓంకార్ తమ్ముడు అశ్విన్, సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ వంటి వారు కూడా విచ్చేసారు. సాయి ధరమ్ తేజ్ రాగానే ఓంకార్ మాట్లాడుతూ ‘ ఇక్కడికి పిలవగానే తనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నారని సాయి ధరమ్ తేజ్ వెంటనే రావడానికి ఒప్పుకున్నాడు. అందరికంటే అతనికి ఇష్టమైనవాడు ఇక్కడే ఉన్నాడు..అతనే అశ్విన్’ అని అంటాడు. అప్పుడు సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘అశ్విన్ బాబు..నువ్వొస్తావనీ తెలుసుంటే నేను అసలు వచ్చేవాడిని కాదు కదరా’ అని అంటాడు. అప్పుడు అశ్విన్ ‘సరే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతా’ అని అంటాడు. ‘ఎప్పుడు వెళ్తున్నావ్’ అని సాయి ధరమ్ తేజ్ అడగ్గా, ‘ఛీ..ఇష్టమైన వ్యక్తిని అని చెప్పి ఇన్ని మాటలు అంటే ఎలారా తేజుబాబు’ అని అంటాడు అశ్విన్.
Also Read : లేడీ గెటప్ లో ఉన్న ఈ క్రేజీ హీరోని గుర్తు పట్టారా? ఏకంగా 100 కోట్ల బడ్జెట్ మూవీ చేస్తున్నాడు!
‘ఇష్టమైన వాడివి కాబట్టే ఇన్ని మాటలు అంటున్నారా’ అంటాడు సాయిధరమ్ తేజ్. అలా వీళ్లిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ఈ ప్రోమోలో బాగా హైలైట్ అయ్యింది. ఇక ఆ తర్వాత డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 టైటిల్ ని గెలుచుకొని 23 లక్షల రూపాయిలను గెలుచుకుంది ఎవరంటే అని ఓంకార్ అనగా, కంటెస్టెంట్స్ వైపు కెమెరాలు తిప్పుతారు. మరి ఎవరి ఈ సీజన్ టైటిల్ గెలవబోతున్నారో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ప్రతీ ఒక్కరు దుమ్ము లేచిపోయే రేంజ్ లో డ్యాన్స్ వేస్తున్నారు. డ్యాన్స్ షో హిస్టరీ లోనే పబ్లిక్ ఓటింగ్ ద్వారా రన్ అవుతున్న ఏకైక షో ఇది మాత్రమే. చూడాలి మరి ఈ సీజన్ ఎవరు గెలవబోతున్నారు అనేది.