Sai Dharam Tej : ఈ చిన్నప్పటి ఫోటో సాయి ధరమ్ తేజాది. ఆయన ఈ మధ్య పేరు కూడా మార్చుకున్నాడు. ఇప్పుడు ఆయన పేరు సాయి దుర్గ తేజ. తల్లి పేరు తన పేరులో ఉండేలా కొత్త పేరు పెట్టుకున్నాడు. చిరంజీవి పెద్ద చెల్లులు విజయ దుర్గ కుమారుడే సాయి ధరమ్ తేజ్. 2014లో పిల్లా నువ్వు లేని జీవితం మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. దర్శకుడు వైవిఎస్ చౌదరి మూవీతో సాయి ధరమ్ తేజ్ హీరో కావాల్సింది. ఆయన తీసిన ‘రేయ్’ డిలే కావడంతో పిల్లా నువ్వు లేని జీవితం మొదట విడుదలైంది. సుప్రీమ్ మూవీతో మొదటి హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ కెరీర్లో ప్రతిరోజూ పండగే, విరూపాక్ష వంటి బిగ్గెస్ట్ హిట్స్ ఉన్నాయి.
Also Read : వైసీపీ ట్రోల్స్ దెబ్బకు డిఫెన్స్ లో పడ్డ సాయిధరమ్ తేజ్.. ఇంత బాధపడుతున్నాడా..?
మేనమామ పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమాలో సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. తమిళ చిత్రం వినోదయ చిత్తం కి బ్రో రీమేక్. పవన్ కళ్యాణ్ దేవుడు పాత్ర చేశాడు. సముద్ర ఖని దర్శకత్వం వహించాడు. బ్రో మూవీ పర్లేదు అనిపించుకుంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ టైటిల్ తో మూవీ చేస్తున్నాడు. కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ బడ్జెట్ ఏకంగా రూ. 120 కోట్లు అని ప్రచారం జరుగుతుంది. అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్స్ వేసి ఒక షెడ్యూల్ పూర్తి చేశారట. సాయి ధరమ్ కి జంటగా ఐశ్యర్య లేక్ష్మి నటిస్తుంది.
సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ సంబరాల ఏటి గట్టు కావడం విశేషం. ఒక కొత్త దర్శకుడిని నమ్మి ఇంత పెద్ద మొత్తంలో పెడుతున్నారు అంటే, కథను, స్క్రిప్ట్ ని అంతగా నమ్మారని అర్థం అవుతుంది. ఈ మూవీ కోసం సాయి ధరమ్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. సిక్స్ ప్యాక్ రాబట్టాడు. సాయి ధరమ్ లుక్ చాలా వైల్డ్ అండ్ ఇంటెన్స్ గా ఉంది.
కాగా సాయి ధరమ్ 2021లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలపాలైన సాయి ధరమ్ తేజ్ సుదీర్ఘ కాలం చికిత్స తీసుకున్నాడు. దాదాపు ఏడాది పాటు ఆయన మీడియా కంట పడలేదు. ఇంటికే పరిమితం అయ్యాడు. తన వాయిస్ కూడా పోయినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆత్మ విశ్వాసంతో సాయి ధరమ్ తేజ్ కోలుకున్నాడు. తిరిగి సినిమాలు చేస్తున్నాడు.
Also Read : మెగా ఫ్యామిలీ లో మరో శుభకార్యం..ఆ యంగ్ హీరోయిన్ తో త్వరలోనే సాయి ధరమ్ తేజ్ పెళ్లి!