Sree Vishnu : శ్రీవిష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సింగిల్'(#Single Movie) ఇటీవలే విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని, బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘సామజవరగమనా’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న శ్రీవిష్ణు, ఆ తర్వాత విడుదలైన ‘స్వాగ్’ చిత్రంతో డిజాస్టర్ ఫ్లాప్ ని ఎదురుకున్నాడు. ఈ సినిమా బాగున్నప్పటికీ, ఎందుకో కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. శ్రీవిష్ణు ఒక్కసారి ఫ్లాప్ ట్రాక్ ఎక్కడంటే, అంత తేలికగా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రాలేడు అనే టాక్ ఇండస్ట్రీ లో ఉండేది. కానీ ఆ టాక్ ని ‘నో ఈవెంట్’ సెంటిమెంట్ బ్రేక్ చేసిందని అంటున్నారు విశ్లేషకులు, దాని తాలూకా వివరాలను ఒకసారి చూద్దాం.
Also Read : ‘ఐటెమ్’ గా మారిపోయిన హీరో శ్రీ విష్ణు..ఆడియన్స్ కి ఊహించని షాక్..అసలు ఏమైందంటే!
‘సామజవరగమనా’, ‘సింగిల్’ చిత్రాలు సూపర్ హిట్స్ అవ్వడానికి, అదే సమయంలో మధ్యలో వచ్చిన ‘స్వాగ్’ చిత్రం ఫ్లాప్ అవ్వడానికి ఒక సెంటిమెంట్ కారణమట. ఆ సెంటిమెంట్ మరేదో కాదు, ఆ రెండు సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం. సమయం లేకపోవడం వల్లనో, లేకపోతే బడ్జెట్ పెరిగిపోతుంది అనే కారణం చేతనో తెలియదు కానీ, ‘సామజవరగమనా’ చిత్రానికి మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయలేకపోయారు. ఆ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘సింగిల్’ చిత్రానికి చిన్న చిన్న ఈవెంట్స్ అయితే చేసారు కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మాత్రం ఏర్పాటు చేయలేదు. పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఈ కార్యక్రమం చేసి ఉండకపోవచ్చు. కానీ ‘స్వాగ్’ చిత్రానికి మాత్రం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చేశారు. ఇది డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.
శ్రీవిష్ణు ఈ సెంటిమెంట్ ని గమనించాడో లేదో తెలియదు కానీ ఒకసారి గమనిస్తే మాత్రం ఇక మీదట తన సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చెయ్యడేమో. ఇక సింగిల్ చిత్రం విషయానికి వస్తే, కేవలం మూడు రోజుల్లోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ ని తెచ్చుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం లాభాలతో థియేటర్స్ లో నడుస్తుంది. ఈ చిత్రం లో హీరోయిన్స్ గా కేతికా శర్మ, ఇవానా నటించారు. ఈ ఏడాది ప్రారంభం లో ‘తండేల్’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ని ఎదురుకొని మంచి లాభాలను మూటగట్టుకున్న గీత ఆర్ట్స్ సంస్థ, ఈ సినిమా ద్వారా మరో భారీ సక్సెస్ ని అందుకుంది. తండేల్ చిత్రానికి వచ్చిన లాభాలకంటే ‘సింగిల్’ చిత్రానికే ఎక్కువ లాభాలే ఎక్కువట. ఫుల్ రన్ ఎక్కడి దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.
Also Read : ఒక్క హిట్ తో రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసిన శ్రీ విష్ణు.. ఇది మరీ ఓవర్ గా లేదూ..?