Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉంటూ వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. తన తోటి హీరోల సినిమాలు విడుదల అవుతున్నప్పుడు క్రమం తప్పకుండా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాడు. అంతే కాకుండా సమాజం లో జరిగే కొన్ని సంఘటనల గురించి ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటాడు. సోషల్ మీడియా ద్వారా ఆయన ఇప్పటి వరకు ఎంతో మందికి సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ వచ్చాడు. అంతే కాకుండా ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా మాట్లాడిన ఒక ప్రముఖ యూట్యూబర్ ని జైలుకు పంపడం లో కూడా సాయి ధరమ్ తేజ్ సక్సెస్ అయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చాలానే ఉన్నాయి. రీసెంట్ గా ఆయన ‘అభయం మాసూమ్ -25’ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమం లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో ఈమధ్య కాలంలో అస్లీలత పెరిగిపోయింది. దీనిపట్ల జాగ్రత్తగా ఉండాలని మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పిల్లల తల్లిదండ్రులను హెచ్చరించాను. వ్యక్తిగత వీడియోలు కానీ, ఫోటోలను కానీ పోస్టు చేయొద్దని సూచించాను. ఎందుకంటే వాటిని కొంతమంది దుర్మార్గులు దుర్వినియోగపర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే నేను వారిలో చైతన్యం తీసుకొని రావడానికి చాలా ప్రయత్నం చేశాను. ఎవరైతే అసభ్యంగా మాట్లాడాడో అతని గురించి ట్విట్టర్ లో పోస్టు చేసి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులను ట్యాగ్ చేశాను. సామజిక మాధ్యమాల్లో ఇలా అస్లీలంగా పోస్టులు పెట్టేవారికి కూడా భవిష్యత్తులో పెళ్లి జరిగి పిల్లలు పుడుతారు కదా, వాళ్ళ గురించి ఇలాగే పోస్టులు చేయగలరా?, నాకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, అలాంటి అస్లీల పోస్టులకు కూడా వందలు, వేల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వచ్చాయి. ఇది అత్యంత విచారకరం’.
‘సమాజం పట్ల కనీస బాధ్యత లేకపోతే ఎలా?, వాళ్ళు చేసిన ఆ నీచమైన కామెంట్స్ పై ఎవరైనా స్పందిస్తారేమో, యాక్షన్ తీసుకుంటారేమో అని 24 గంటలు వేచి చూసాను. ఎవ్వరూ స్పందించలేదు. ఇక నేరుగా నేనే రంగం లోకి దిగి పోస్టు చేయాల్సి వచ్చింది. డార్క్ కామెడీ అంటూ చెప్పి ఇలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడే వాళ్ళను ఊరికే వదలకూడదు. ఇతరుల సెంటిమెంట్ ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు’ అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ప్రతీ మాటలోనూ ఫైర్ ఉంది. అల్లరి గా, సరదాగా కనిపించే సాయి ధరమ్ తేజ్ లో సమాజం పట్ల ఇంత గౌరవ మర్యాదలు ఉన్నాయా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్ వాళ్ల Aadhaar, లేదా వాళ్ల Parents ఫోన్ తో లింక్ చేయాలి… @IamSaiDharamTej
90% తెలుగు ట్విట్టర్ ఖాళీ అవడం ఖాయం? pic.twitter.com/0c24qExyAG
— M9 NEWS (@M9News_) September 13, 2025