Mirai Movie Collection: భారీ అంచనాల నడుమ నిన్న విడుదలైన మిరాయ్(Mirai Movie) చిత్రానికి మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ రావడం మనమంతా చూసాము. సినిమాలోని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, కేవలం 60 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమాని వెండితెర పై చూస్తుంటే 400 కోట్ల రూపాయిల రేంజ్ క్వాలిటీ కనిపించిందని, ఇలాంటి సినిమా కోసమే కదా ఆడియన్స్ ఎదురు చూస్తుంది అంటూ సోషల్ మీడియా నెటిజెన్స్ ఊగిపోయారు. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజు ఈ చిత్రానికి 27 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తేజ సజ్జ లాంటి మీడియం రేంజ్ హీరో కి ఈ రేంజ్ వసూళ్లు అంటే సాధారణమైన విషయం కాదు. మౌత్ టాక్ కూడా పాజిటివ్ గా జనాల్లోకి బాగా వెళ్లడం తో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి క్యూలు కడుతున్నారు. ప్రధాన నగరాల్లో టికెట్ ముక్క దొరికితే ఒట్టు. ఆ రేంజ్ లో ఇరగకుమ్మేస్తుంది ఈ మూవీ.
మొదటి రోజు బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి 3 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. రెండవ రోజు కూడా బుక్ మై షో ట్రెండ్ ఇంచుమించు మొదటి రోజుతో సమానంగానే ఉంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజు కూడా బుక్ మై షో యాప్ లో 3 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ షోస్ మరియు సెకండ్ షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదటి రోజు కంటే అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాకు ఓవరాల్ గా రెండవ రోజు వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
ఇదే రేంజ్ కలెక్షన్స్ కొనసాగుతూ ముందుకు వెళ్తే కచ్చితంగా ఈ చిత్రం కూడా 300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సెప్టెంబర్ 25 న ఓజీ చిత్రం విడుదల అవుతుంది కాబట్టి, అప్పటి వరకు ఈ చిత్రం వసూళ్లకు ఎలాంటి ఢోకా లేదు. అంత వరకు ఈ చిత్రానికి 300 కోట్ల గ్రాస్ వస్తుందా లేదా అనేది చూడాలి. అంత గ్రాస్ రావాలంటే కచ్చితంగా ఈ చిత్రం వర్కింగ్ డేస్ లో బలమైన హోల్డ్ ని చూపించాలి. చూడాలి మరి ఈ సినిమా రేంజ్ ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుంది అనేది.