https://oktelugu.com/

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించబోతున్న ‘షకీలా’..!

మూతి మీద మీసం మొలిచిన ప్రతీ మగాడికి షకీలా గురించి తెలుసంటే అతిశయోక్తి కాదేమో. రసిక ప్రియులందరికీ షకీలా ఆరాధ్య దైవమనే చెప్పాలి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ శృంగార తార బయోపిక్ త్వరలోనే ప్రేక్షకులను రాబోతోంది. దీంతో ఈ సినిమాపై షకీలా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Also Read: ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలుస్తానంటున్న మెగా హీరో ! మల్లువుడ్ శృంగారతారగా పేరొందిన షకీలా సినిమాలన్నీ కూడా మలయాళంలో సస్సేషన్ క్రియేట్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 16, 2020 / 04:53 PM IST
    Follow us on

    మూతి మీద మీసం మొలిచిన ప్రతీ మగాడికి షకీలా గురించి తెలుసంటే అతిశయోక్తి కాదేమో. రసిక ప్రియులందరికీ షకీలా ఆరాధ్య దైవమనే చెప్పాలి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ శృంగార తార బయోపిక్ త్వరలోనే ప్రేక్షకులను రాబోతోంది. దీంతో ఈ సినిమాపై షకీలా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    Also Read: ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలుస్తానంటున్న మెగా హీరో !

    మల్లువుడ్ శృంగారతారగా పేరొందిన షకీలా సినిమాలన్నీ కూడా మలయాళంలో సస్సేషన్ క్రియేట్ చేశాయి. షకీలా సినిమాలు మలయాళంతోపాటు ఇతర భాషల్లోనూ డబ్ అయి అప్పట్లో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. స్టార్ హీరోలు సైతం ఆమె సినిమా వస్తుందంటే రిలీజు డేట్స్ ను వాయిదా వేసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.

    అప్పట్లో అంత క్రేజ్ దక్కించుకున్న షకీలా ఆ తర్వాత మాత్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావడం శోచనీయంగా మారింది. జీవితంలో ఎన్నో అటుపోట్లను చవిచూసిన షకీలా జీవితం ఆధారంగా సినిమాగా రాబోతుంది. ‘షకీలా’ పేరుతో తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా టైటిల్ రోల్ ప్లే చేస్తోంది.

    Also Read: ఎన్టీఆరా? మజాకా.. ఆ టీవీ షోకు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

    షకీలాను ఈ మూవీలో సూపర్ స్టార్ గా చూపించబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలకాగా ప్రేక్షకుల నుంచి అనుహ్య స్పందన వచ్చింది. ‘షకీలా’ మూవీని హిందీ.. తెలుగు.. తమిళం.. కన్నడ.. మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.

    క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ మూవీని రాబోతుంది. దేశవ్యాప్తంగా 1000 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ఫిల్మ్ మేకర్స్ ప్రకటించారు. కరోనా తర్వాత ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే చిత్రం ‘షకీలా’ నిలిచిపోతుందని చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్