Sai Dharam Tej: యాక్సిడెంట్ కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ టాలీవుడ్ నటుడు నరేశ్(Naresh) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బైక్ రేసింగ్ ను ప్రస్తావిస్తూ తన కుమారుడు నవీన్, సాయిధరమ్ తేజ్ లు ఇలా స్పోర్ట్స్ బైక్ లపై వెళుతుంటారని నరేశ్ చేసిన కామెంట్లు కలకలం రేపాయి. దీనిపై విమర్శలు రావడంతో తాజాగా మరోసారి వివరణ ఇస్తూ సాయంత్రం వీడియో విడుదల చేశారు.
‘ఓ చాయ్ దుకాణం ప్రారంభోత్సవానికి నా కుమారుడు నవీన్, సాయిధరమ్ తేజ్ వెళ్లారని.. రోడ్డుపై మట్టి ఉన్న కారణంగానే సాయిధరమ్ జారి ప్రమాదానికి గురయ్యాడని’ నరేశ్ స్పష్టం చేశారు. ఎక్కువ స్పీడులో కూడా లేడని సీసీటీవీ ఫుటేజీ చూస్తే అర్థమవుతోందన్నారు. ఇది నిర్లక్ష్యం కాదని.. కేవలం ప్రమాదం మాత్రమేనని నరేశ్ క్లారిటీ ఇచ్చారు. బిడ్డలు బాగుండాలని నేరు కోరుకుంటాను తప్పితే మరో ఆలోచన లేదని.. నా మాటలు వక్రీకరించారని నరేశ్ చెప్పుకొచ్చాడు.
సాయిధరమ్ క్షేమంగా బయటపడినందుకు చాలా సంతోషంగా ఉందని.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని నరేశ్ ఒక వీడియోలో తెలిపారు.