https://oktelugu.com/

Sai dharam Tej: ఆ విషయంలో మేనమామను… ఫాలో అవుతున్న సాయి ధరమ్ తేజ్ ?

Sai dharam Tej: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్… దాదాపు బైక్ యాక్సిడెంట్ లో గాయపడి 35 రోజుల చికిత్స అనంతరం ఇటీవల ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మెగా మేనల్లుడు మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నాడు. సాయి తేజ్ యాక్సిడెంట్ జరగడానికి ముందు మీడియా లో ఆయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అనే కదనలు రావడం తెలిసిందే. అయితే ఇప్పుడు త్వరలోనే ఈ వార్తలు నిజం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 17, 2021 / 11:39 AM IST
    Follow us on

    Sai dharam Tej: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్… దాదాపు బైక్ యాక్సిడెంట్ లో గాయపడి 35 రోజుల చికిత్స అనంతరం ఇటీవల ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మెగా మేనల్లుడు మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నాడు. సాయి తేజ్ యాక్సిడెంట్ జరగడానికి ముందు మీడియా లో ఆయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అనే కదనలు రావడం తెలిసిందే. అయితే ఇప్పుడు త్వరలోనే ఈ వార్తలు నిజం కానున్నాయని సమాచారం అందుతుంది. మేనమామ పవన్ కళ్యాణ్ బాటలోనే ఫారిన్ అమ్మాయిని ఈ యంగ్ హీరో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది.

    సునిల్ రెడ్డి దర్శకత్వం లో సాయితేజ్ నటించిన తిక్క సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటది. కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో లారిస్సా బొరేసి, మన్నారా చోప్రా , రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. అయితే తేజ్ పలు సంధర్భాల్లో లారిస్సా పై క్రష్ ఉందని పలు ఇంటర్వ్యూ లలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల్ ఆయన హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా విడుదల అయ్యింది. ఈ  మూవీ విడుదల సమయంలో ‘నా తేజు నటించిన రిపబ్లిక్ ఈరోజు విడుదలవుతుంది’ అంటూ ట్వీట్ చేస్తూ లవ్ సింబల్‌ను పోస్ట్ చేసింది లారిస్సా.

    https://twitter.com/larissabonesi/status/1443721154519306240?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1443721154519306240%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Ftnewstelugu-epaper-tnewstel%2Fmenamaamapavanbaataloalludutejfaarinammaayitopremapellikuda-newsid-n324318198%3Fs%3Dauu%3D0x66387b0339dab938ss%3Dwsp

    అలానే తాజాగా ఐ మిస్ యు తేజ్, ‘ఐ యామ్ ఇన్ లవ్‌’… అంటూ ట్వీట్ లు చేయడంతో ఆమె సాయితేజ్‌తో ప్రేమలో ఉందని నెటిజన్లు అంటున్నారు. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మెగా కాంపౌండ్ నుండి ఎవరైనా స్పందించే  వరకు వేచి చూడక తప్పదు. అయితే ఇక్కడ మెగా ఫ్యామిలి అభిమానులంతా సాయి తేజ్ పెళ్లి విషయంలో మేనమామ పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్నాడా అని అంటున్నారు.