Sai Dharam Tej : మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి దుర్గ తేజ్(Sai Durga Tej) తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా ఏర్పాటు చేశాయి. ఒక మూడు సంవత్సరాల క్రితం ఆయన బైక్ మీద ఓవర్ స్పీడ్ తో వచ్చి పడిపోయిన విషయం మనకు తెలిసిందే.ఆ యాక్సిడెంట్ తర్వాత ఆయన తనను తాను చాలా వరకు మార్చుకున్నాడు. మరి ఇదిలా ఉంటే ఈమధ్య ఏ రకమైన రాజకీయ ట్రోల్స్ వచ్చినా కూడా అందులోకి సాయి దుర్గతేజ్ ని లాగుతున్నారు. కారణం ఏంటి అంటే ఇంతకు ముందు జనసేన పార్టీ తరఫున ఆయన ప్రచారం చేయడమే అని కొంతమంది అంటుంటే, మరికొంతమంది మాత్రం సాయి దుర్గతేజ్ ని కొంతమంది టార్గెట్ చేసి ఆయన కెరియర్ ను దెబ్బతీయాలని ఇలాంటి ట్రోల్స్ ని లేవనెత్తుతున్నారు అంటూ సమాధానం అయితే చెబుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ ఈ విషయం మీద స్పందించాడు…
తను రాజకీయాల గురించి మాట్లాడనని, తనని సినిమాలకు దూరం చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేశాడు. కేవలం వినోదాన్ని పంచడానికి మాత్రమే తను ఉన్నట్టుగా తెలియజేశాడు. ఇక రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాలంటే చాలా విషయాలు నేర్చుకోవాలి, గొప్ప అనుభవం కావాలి.
ఏదో ఫాలోయింగ్ ఉంది కదా అని పాలిటిక్స్ లోకి వస్తే అక్కడ నిలబడడం అంత ఆషామాషి వ్యవహారమైతే కాదు. కాబట్టి తనను సినిమాలకు దూరం చేయకండి కేవలం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే తను ఉన్నాడని తెలియజేశాడు. నిజానికి ఆయన రేపు ఏం జరుగుతుంది అనే దాని గురించి కూడా ఆలోచించడట…ఇక ఈ క్షణం హ్యాపీగా ఉన్నామా లేదా అనే దాని గురించే చూసుకుంటనని ఎమోషనల్ గా స్పందించాడు…
ఇక ఏది ఏమైనా కూడా వీరూపాక్ష (Virupksha) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సాయి దుర్గతేజ్ ఆ తర్వాత వచ్చిన బ్రో (Bro) సినిమాతో డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు. మరి ఇప్పుడు రాబోతున్న సినిమాలతో మంచి విజయాలను సాధించి మరోసారి మెగా ఫ్యామిలీ నుంచి తనకి కూడా స్టార్ హీరో అయ్యే అవకాశం ఉందని ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి ఇక రాబోయే రోజుల్లో సాయి దుర్గ తేజ్ సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది…