Tollywood star Hero
Tollywood star Hero : సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం నెంబర్ వన్ హీరోలుగా దూసుకుపోవాలనే ఉద్దేశ్యంతో ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు డిఫరెంట్ గా ప్రజెంట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లు ఉన్నవాళ్లు మాత్రమే స్టార్లుగా వెలుగొందుతారు. ఇక ఏమాత్రం తడబడిన కూడా ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడవచ్చు… ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోతో యంగ్ డైరెక్టర్లు సినిమాలు చేయాలంటే మాత్రం ఆ డైరెక్టర్ చెప్పిన కథ ఆ స్టార్ హీరో తో పాటు కొంతమంది సీనియర్ రచయితలకు కూడా నచ్చాలి. లేకపోతే ఆ సీనియర్ రచయితలే దర్శకుడి దగ్గర ఉన్న కథను తీసుకొని దాన్ని పోస్టుమార్టం చేసి అందులో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలో వాళ్లే డిసైడ్ చేస్తారు. యంగ్ డైరెక్టర్ రాసుకున్న కథ మొత్తం చచ్చిపోతుంది.
అతను ఒక కథ పట్టుకుని వెళ్తే ఆ సీనియర్ రచయితలు ఎప్పుడో 90స్ కాలం నాటి కథలను పట్టుకువచ్చి పాత చింతకాయ పచ్చడి లాగా మార్చేసి సినిమా చేయని చెబుతున్నారట. దానికీ ఆ హీరో కూడా మద్దతు ఇస్తున్నాడట. ఇక ఇంతకీ ఆ హీరో ఎవరు, ఆ రచయితలు ఎవరు అనే విషయం పక్కన పెడితే ఆ హీరోతో సినిమా చేయాలని యంగ్ డైరెక్టర్స్ ఉత్సాహం చూపించినప్పటికి ఇలాంటి కండిషన్స్ అన్నింటికి ఒప్పుకొని సినిమా చేయడానికి ఆ దర్శకుడు ముందుకొస్తేనే సినిమా ఉంటుంది.
లేకపోతే మాత్రం అతనితో సినిమా చేయాలనుకునే వాళ్ళు వెనకడుగు వేయక తప్పదు. ఇలాంటి వ్యవహారాలన్నీ చేయడం వల్లే ఆ హీరోకి ఈ మధ్య భారీ సక్సెసులైతే రావడం లేదు. మరి ఏది ఏమైనా కూడా ఈ రోజుల్లో యంగ్ డైరెక్టర్లు ఆ హీరోతో సినిమా చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి… ఇక అందుకోసమే కుర్ర డైరెక్టర్లు ఎవరూ కూడా ఆ హీరోని సంప్రదించడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో కాలానికి అనుగుణంగా కొత్త కథలతో ముందుకు సాగాలి.
అంతేకానీ పాత చింతకాయ పచ్చడి లాంటి కథలో కొన్ని ఎమోషనల్ సీన్స్ ని యాడ్ చేసి కొత్తగా తీద్దాం అనుకుంటే మాత్రం ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఆ కథలు ఆ సినిమాలు అయితే నచ్చవు. మరి మారుతున్న కాలంతో పాటు హీరోలు గాని, వాళ్ల క్యారక్టరైజేశన్ గాని మారినప్పుడే ఆ సినిమాలు పూర్తిస్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్నప్పుడే సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. లేకపోతే మాత్రం భారీగా డిజాస్టర్లను మూటగట్టుకోక తప్పదనే చెప్పాలి…