https://oktelugu.com/

Sai Dharam Tej: మెగా ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. ఆసుపత్రి నుంచి తేజ్​ డిశ్చార్జ్​

Sai Dharam Tej: మెగా ఫ్యాన్స్​కు శుభవార్త చెప్పిన  మెగాస్టార్​ చిరంజీవి. ఆయన మేనల్లుడు, హీరో సాయిధరమ్​ తేజ్​కు ఇటీవలె ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కాగా, ఇవాళ ఉదయం ఆసుపత్రి నుంచి తేజ్​ డిశ్చార్జ్​ అయ్యారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ట్విట్టర్​ వేదికగా తెలిపారు. దీనికి తోడు ఈ రోజు తేజ్​ పుట్టినరోజు కావడం విశేషం. ఈ సందర్భంగా సాయి తేజ్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి ట్వీట్​ చేశారు. విజయ దశమి రోజున […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 15, 2021 / 11:48 AM IST
    Follow us on

    Sai Dharam Tej: మెగా ఫ్యాన్స్​కు శుభవార్త చెప్పిన  మెగాస్టార్​ చిరంజీవి. ఆయన మేనల్లుడు, హీరో సాయిధరమ్​ తేజ్​కు ఇటీవలె ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కాగా, ఇవాళ ఉదయం ఆసుపత్రి నుంచి తేజ్​ డిశ్చార్జ్​ అయ్యారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ట్విట్టర్​ వేదికగా తెలిపారు. దీనికి తోడు ఈ రోజు తేజ్​ పుట్టినరోజు కావడం విశేషం. ఈ సందర్భంగా సాయి తేజ్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి ట్వీట్​ చేశారు.

    విజయ దశమి రోజున సాయి ధరమ్‌ తేజ్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. తేజ్​ పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డ తేజ్‌కు ఇది పునర్జన్మ అనే చెప్పాలి. గత నెల వినాయక చవితి రోజు సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సాయి… 35 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. దీంతో మెగా ఇంట్లో విజయం దశమి పండుగ సంతోషం మరింత రెట్టింపయ్యింది.

    అయితే తేజ్​కు యాక్సిడెంట్​ అయిన సమయంలో సోషల్​మీడియా, పలు టీవీ చానెల్స్​లో రకరకాల వార్తలు వినిపించాయి. వీటిపై స్పందించిన మెగా ఫ్యామిలీ అవన్నీ అవాస్తవమని తెలిపింది. నిజానిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ వార్తతో  తేజ్ అభిమానులు ఆయన కు పుట్టిన రోజు శుభాకాంక్షలతో పాటు , నిండు నూరేల్లు ఆరోగ్యంతో ఉండాలని సోషల్ మీడియా లో పోస్ట్ లు చేస్తున్నారు.