‘సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి త్వరగా మెరుగవుతోంది’ అంటూ మొన్న మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసిన దగ్గర నుంచి.. సాయి తేజ్ కి పూర్తిగా తగ్గిపోయింది అన్నట్టు, హాస్పిటల్ నుంచి ఇంటికి కూడా షిఫ్ట్ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే, సాయి ధరమ్ తేజ్ మరో 20 రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉండాలి.
అపోలో ఆసుపత్రి వర్గాల అప్ డేట్ ప్రకారం.. సాయి తేజ్ పూర్తిగా కోలుకునేందుకు ఇంకా మరో పాతిక రోజుల సమయం పట్టేలా ఉంది. ఇప్పటికీ సాయి తేజ్ కి మధ్యమధ్యలో వెంటిలేటర్ పెడుతున్నారు. అయితే, ఎక్కువ సమయం వెంటిలేటర్ సపోర్ట్ తీసుకోవడం లేదు, కానీ ఆ సమయంలో సాయి ధరమ్ తేజ్ బాగా వీక్ గా ఉంటున్నారట.
కాబట్టి.. ఆయనకు మరో నెల రోజులైనా రెస్ట్ తప్పనిసరి అంటున్నారు డాక్టర్స్. అంటే సాయి తేజ్ జనం ముందుకు రావడానికి మరో రెండు నెలల సమయం పట్టొచ్చు. సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్ కి కూడా మరో 25 రోజులు టైం పట్టేలా ఉంది. ఇక ‘సాయి ధరమ్ తేజ్’ రిపబ్లిక్ సినిమా రిలీజ్ రెడీ అయింది. మరో పది రోజుల్లో ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది.
కానీ సినిమా ప్రమోషన్స్ లో సాయి తేజ్ కనిపించడు. నిజానికి తేజ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇక ఈ సినిమాలో తేజ్ వేసిన ఒక డ్యాన్స్ మూవ్మెంట్ హైలైట్ గా ఉంటుంది. మొత్తానికి సాయి తేజ్ ఈ సినిమా కోసం క్రేజీ స్టెప్స్ ను కష్టపడి వేశాడు. ఎలాగూ దర్శకుడు దేవకట్టా కాబట్టి, సినిమా అంతటా విలువలే ఉంటాయి, వినోదానికి పెద్దగా స్కోప్ కూడా ఉండదు.
కాబట్టి కనీసం తేజ్ డ్యాన్స్ అయినా మెగా ఫ్యాన్స్ కి మంచి రిలీఫ్ ఇచ్చి.. సినిమా పెద్ద హిట్ అవుతుందేమో చూడాలి.