Homeఎంటర్టైన్మెంట్Kamal Haasan: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన లోక నాయకుడు కమల్ హాసన్...

Kamal Haasan: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన లోక నాయకుడు కమల్ హాసన్…

Kamal Haasan: ప్రముఖ హీరో, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హసన్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇందుకు గాను ఆయన చెన్నైలోని రామచంద్ర మెడికల్ సెంటర్ లో చికిత్స తీసుకుంటున్నారు. నవంబర్ 22న ఆసుపత్రిలో చేరిన కమల్… 12 రోజుల చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న కమల్ ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన తెలియచేస్తూ, తాను త్వరగా కోలుకోవాలని మనసారా ఆకాంక్షించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ కు, ఇతర రాజకీయ నాయకులకు, అలానే ప్రముఖ నటుడు రజనీకాంత్ తో పాటు చిత్రసీమకు చెందిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

actor kamal haasan cured from covid 19 and discharged from hospital
Kamal Haasan

Also Read: RRR Movie: “ఆర్‌ఆర్‌ఆర్” ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్… పూనకాలకు రెడీ గా ఉండండి అంటూ

తనకు వైద్యం అందించిన శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ వైద్యబృందానికి కమల్ హాసన్ కృతజ్ఞతలు చెప్పారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని… వెంటనే తన కార్యక్రమాలు మొదలు పెడతానని తెలిపారు. షూటింగ్​ నిమిత్తం అమెరికా వెళ్లి వచ్చిన కమల్​ ఒంట్లో నలతగా ఉండి పలు కొవిడ్​ లక్షణాలు కనిపించడంతో వెళ్లి టెస్టు చేయించుకోగా.. పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. కాగా, ప్రస్తుతం కమల్​ విక్రమ్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విభిన్న పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో విజయ్​సేతుపతి కూడా కనిపించనున్నారు. ఇటీవలే విడుదలైన గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. ​కమల్ హాసన్ ఆరోగ్యం కుదుటపడిందన్న వార్తతో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Also Read: Kangana: ఈ దాడితో నైనా ‘కంగనా’లో మార్పు వస్తోందా

 

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version