Sai Abhyankkar: ఇప్పటి వరకు ఎంతమంది నటులు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ వాళ్ళకంటూ సెపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు దూసుకెళ్లాలి… ఇక హీరోలనే కాకుండా ప్రతి టెక్నీషియన్ కూడా వాళ్లకు వచ్చిన అవకాశాలను వాడుకుంటూ ముందుకు సాగాల్సిన అవకాశం అయితే ఉంటుంది…
Also Read: కమెడియన్ సత్య కాళ్ళు పట్టుకోబోయిన రామ్ చరణ్..వీడియో వైరల్!
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకొని ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఒక యువ కెరటం తన మ్యూజిక్ తో వండర్స్ క్రియేట్ చేసి ఏకంగా అల్లు అర్జున్ అట్లీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి…ఇంతకీ తను ఎవరు అంటే సాయి అభ్యంకర్…ఆయన యూట్యూబ్ లో తన మ్యూజిక్ తో పెను సంచలనాలను క్రియేట్ చేశాడు. ఆయన 2024 వ సంవత్సరంలో కంపోజ్ చేసిన ‘కట్చీ సేరీ’ అనే తమిళ్ సాంగ్ 220 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సాంగ్ తర్వాత ‘ఆశ’ అనే సాంగ్ 245 మిలియన్ల వ్యూస్ ను సంపాదించింది…
ఇక మీనాక్షి చౌదరి నటించిన ‘సితిరి పుతిరి ‘ అనే సాంగ్ కి మ్యూజిక్ కంపోజ్ చేసింది కూడా సాయి అభ్యంకర్ కావడమే విశేషం…ఇక ఆయన తండ్రి అయిన టిప్పు సైతం ప్లే బ్యాక్ సింగర్ కావడం విశేషం…ఇక ఆయన తెలుగులో జులాయి సినిమాలోని ‘పక్కన బైక్ ఉంది’ అనే సాంగ్ ను పాడారు.
అలాగే నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోని ‘ఉన్నమాట చెప్పనీవు’ అనే సాంగ్ కూడ పాడాడు. ఇక వాళ్ల మదర్ హరిని కూడా సింగర్ కావడం తో చిన్నప్పటి నుంచే సాయి కి మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ను వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు…ఇక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుధ్ రవిచంద్రన్ దగ్గర బిజిఎం అసిస్టెంట్ గా పనిచేశాడు…మొత్తానికైతే సాయి అభ్యంకర్ కి మ్యూజిక్ మీద మంచి నాలెడ్జ్ ఉండటం తో ఆయన చాలా మంచి సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాడు.
ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ అల్లు అర్జున్ కి బాగా నచ్చాయట…దాంతో అల్లు అర్జున్ అట్లీ కాంబోలో చేయబోతున్న సినిమాకి సాయి అభ్యంకర్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని చూస్తున్నారట…మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే సినిమా యూనిట్ నుంచి ఆఫియల్ అనౌన్స్ మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే…ఇక అట్లీ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలను మించి ఈ సినిమా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది…