Ram Charan : యాంకర్ ప్రదీప్(Anchor Pradeep) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి'(Akkada Ammayi..Ikkada Abbayi) రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో ప్రదీప్ ఫుల్ బిజీ గా ఉన్నాడు. రెగ్యులర్ ప్రొమోషన్స్ లాగా కాకుండా, కాస్త డిఫరెంట్ గా ప్రొమోషన్స్ ని ప్లాన్ చేశారు. ముందుగా టీవీ సెలబ్రిటీస్ తో కలిసి కొన్ని స్పెషల్ స్కిట్స్ ని యూట్యూబ్ లో చేశారు. అవి బాగా వైరల్ అయ్యాయి, ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోలతో స్పెషల్ ప్రొమోషన్స్ ని చేయిస్తున్నాడు. నిన్న ఆయన ప్రముఖ కమెడియన్ సత్య(Comedian Satya) తో కలిసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆయన రామ్ చరణ్ తో మొట్టమొదటి టికెట్ ని కొనుగోలు చేయించాడు. అందుకు సంబంధించిన స్పెషల్ వీడియో ని నిన్న విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
Also Read : రామ్ చరణ్ మీద హాట్ కామెంట్స్ చేసిన ఉపాసన…
కమెడియన్ సత్య ఇక్కడ కూడా తన కామెడీ టైమింగ్ కి పని చెప్పాడు. రామ్ చరణ్ రాగానే ముందుగా ప్రదీప్ ని పలకరిస్తారు కానీ, సత్య ఎవరో తెలియదు అంటాడు. అప్పుడు సత్య తాను మగధీర చిత్రం లో చేశానని, రంగస్థలం చిత్రం లో మీ చేతితో చెంప దెబ్బ తిన్నానని అంటాడు. అయినప్పటికీ రామ్ చరణ్ గుర్తు పట్టడు. అప్పుడు సత్య ప్రదీప్ తో మాట్లాడుతూ ‘సార్ కి పేర్లు గుర్తుండవు..కానీ మనుషులు గుర్తుంటారు’ అని అంటాడు. అలా వీడియో చివరి వరకు రామ్ చరణ్ తనకి సత్య ఎవరో తెలియదు అన్నట్టే నటిస్తే. చివర్లో హలో సత్య ఎలా ఉన్నావ్ అని పలకరిస్తాడు. అప్పుడు సత్య రామ్ చరణ్ కాళ్ళు పట్టుకోబోతే, రామ్ చరణ్ ఆపి, సత్య కాళ్ళు పట్టుకోబోతాడు. ఇది చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపించింది. మీరు కూడా ఈ వీడియో ని చూసేయండి.
ఇకపోతే టీవీ షోస్ తో నిత్యం బిజీ గా ఉండే యాంకర్ ప్రదీప్, కొన్నాళ్ళు టీవీ కి బ్రేక్ ఇచ్చి మరీ ఈ సినిమా కోసం పని చేశాడు. సినిమా కూడా చాలా బాగా వచ్చిందని, కామెడీ అద్భుతంగా వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. అదే కనుక నిజమైతే ఈ సినిమా ప్రదీప్ కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిలుస్తుందని అనుకోవచ్చు. ఈ చిత్రానికి ముందు ఆయన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమా చేసాడు. కమర్షియల్ గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు మరో గన్ షాట్ హిట్ లాంటి సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ట్రైలర్ ని చూసిన తర్వాత కచ్చితంగా ఈ చిత్రం తో ప్రదీప్ భారీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడని అర్థం అవుతుంది. ట్రైలర్ లో చూపించిన కొన్ని కామెడీ షాట్స్ కూడా బాగా పేలాయి.
Also Read : రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి సినిమా చేసి ఉంటే బాగుండేదా..?