మెగా బ్రదర్ నాగబాబు ‘జబర్దస్త్’ షో నుంచి తప్పుకున్న తర్వాత జీ టీవీలో ‘అదిరింది’ షోను ప్లాన్ చేశారు. భారీ అంచనాల మధ్య ప్రారంభమైన ఈ కామెడీ షో జబర్దస్త్ ను బీట్ చేయలేకపోయింది. అయినప్పటికీ ఈ షో ద్వారా కొంతమంది కామెడీయన్లు వెలుగులోకి వచ్చారు. ఈక్రమంలోనే ‘అదిరింది’షోను ‘బొమ్మ అదిరింది’గా నాగబాబు ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా సూపర్ హిట్టయింది.
Also Read: బాపురే అనిపిస్తున్న మహేష్ క్రేజ్.. ఫ్యాన్స్ ఫిదా..!
‘అదిరింది’ షో కంటే ‘బొమ్మ అదిరింది’ షో బాగా క్లిక్ అయింది. తొలి ఎపిసోడ్లోనే గల్లీ బాయ్స్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఓ స్కిట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీనిపై రాజకీయంగా దుమారం చెలరేగడంతో ఈ స్కిట్లో నటించిన కామెడీయన్లు.. షో నిర్వాహాకులు జగన్ అభిమానులు క్షమాపణలు చెప్పారు. ఇక దీనిని కంటిన్యూ చేస్తూ ‘బొమ్మ అదిరింది’ షో టీఆర్పీలో దూసుకెళుతోంది.
‘బొమ్మ అదిరింది’లో చాలామంది కామెడీయన్లు ఉన్న గల్లీ బాయ్స్ టీమ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సద్దాం చేసే స్కిట్లకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. డబుల్ మీనింగ్ డైలాగ్‌లు.. మాస్‌కు మెచ్చేలా సెటైర్లు వేస్తూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. తాజాగా విడుదలైన ప్రొమోలోనూ శ్రీముఖి పర్సనాలిటీపై సెటైర్ వేయడం కన్పించింది.
Also Read: పవన్ రీమేక్ చిత్రం.. త్రివిక్రమ్ స్టైల్లో మారనుందా?
స్కిట్టులో భాగంగా సద్దాం ఓ రాజులా ఎంట్రీ ఇస్తూనే శ్రీముఖిపై దారుణమైన సైటర్ వేశాడు. శ్రీముఖి నా మొదటి భార్య అంటూ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరో సెటైర్ వేశాడు. ఈశాన్యంలో బరువు ఉండాలని పురోహితుడి చెప్పాడని అందుకే శ్రీముఖిని చేసుకున్నాను అంటూ ఆమె ఓవర్ వెయిట్‌పై కౌంటర్ వేశాడు. దీంతో శ్రీముఖి మొఖం చిన్నబోయింది. మొత్తానికి ‘బొమ్మ అదిరింది’ ప్రొమో ఆకట్టుకుంది. ఈవారం గెస్ట్ గా సీనియర్ హీరోయిన్ లైలా ఎంట్రీ ఇచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్