https://oktelugu.com/

Prabhas : ప్రభాస్ అభిమానులకు చేదువార్త..’స్పిరిట్’ చిత్రం ఇప్పట్లో లేనట్టేనా..? కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి 'స్పిరిట్'. 'యానిమల్' లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై అంచనాలు ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకున్నాయి.

Written By: , Updated On : January 30, 2025 / 06:22 PM IST
Prabhas

Prabhas

Follow us on

Prabhas : ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘స్పిరిట్’. ‘యానిమల్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై అంచనాలు ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి నేడు సోషల్ మీడియా లో రెండు రకాల వార్తలు ప్రచారమవుతూ అభిమానులను తికమక కి గురి చేసింది. కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కి శుభ వార్త అని చెప్పి, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే నెల నుండి మొదలు కాబోతుందని ప్రచారం చేస్తే, మరికొంతమంది మాత్రం ప్రభాస్ అందుబాటులో లేదు, యూరోప్ లో ఉన్నాడు, తిరిగి వచ్చిన తర్వాత ఆయన ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’ చిత్రాలపైనే ఎక్కువ ద్రుష్టి సారిస్తారని, ‘స్పిరిట్’ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవని ప్రచారం చేస్తున్నారు.

ఈ రెండు వార్తల్లో ఏది నిజమో అర్థంకాక అభిమానులు తికమక పడుతున్నారు. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే, ప్రభాస్ ప్రస్తుతం తన కాళ్లకు గాయం జరిగినందున కొంతకాలం డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్పడంతో, యూరోప్ కి వెళ్లాడని, మరికొన్ని రోజులు ఆయన అక్కడే విశ్రాంతి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ చిత్రం ఈ సమయానికి షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని, ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధంగా ఉండేది. కానీ ప్రభాస్ విశ్రాంతి కారణంగా వాయిదా పడింది. అదే విదంగా ‘ఫౌజీ’ మూవీ కి కూడా భారీ సెట్స్ ని ఏర్పాటు చేసి, ప్రభాస్ రాగానే ఆయన కాల్ షీట్స్ ని తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు ఆ చిత్ర నిర్మాతలు. ‘ఫౌజీ’ తో పాటు ‘స్పిరిట్’ కూడా చేయాలనేది ప్రభాస్ ఆలోచన. కానీ స్పిరిట్ చిత్రానికి మేకోవర్ అవసరం. రెండు సినిమాలకు ఒకే లుక్ మైంటైన్ చేయడం కుదరదు.

కాబట్టి ‘ఫౌజీ’ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యాకనే ‘స్పిరిట్’ పై ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ ఏడాదిలోనే కచ్చితంగా ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ మొదలవుతుంది కానీ, మే నెలలో మాత్రం కాదు అని స్పష్టంగా తెలుస్తుంది. డైరెక్టర్ సందీప్ వంగ పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ ని సిద్ధం చేసి, ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఆయన ఎదురు చూపులు కొంతకాలం కొనసాగాల్సిందే. ఈ చిత్రంలో నటించే నటీనటులపై పూర్తి క్లారిటీ అతి త్వరలోనే ఇవ్వనున్నారు మేకర్స్. వరుణ్ తేజ్ ఇందులో నెగటివ్ రోల్ చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి, అందులో ఎంత మాత్రం నిజం ఉందో క్లారిటీ రానుంది. అదే విధంగా ఈ చిత్రం లో ప్రముఖ కొరియన్ హీరో డాన్ లీ విలన్ గా నటిస్తున్నట్టు కూడా వార్తలొచ్చాయి, దీనిపై కూడా స్పష్టత రానుంది.