https://oktelugu.com/

Kethireddy Venkatarami Reddy: ఈవీఎంల ట్యాంపరింగ్ కాదు.. వైసిపి తప్పిదాలే.. స్వరం మార్చిన కేతిరెడ్డి

ఏదైనా విషయం ఆలస్యంగా తెలుస్తుందంటారు. ఇప్పుడు వైసీపీ( YSR Congress) ఓటమికి గల కారణాలను ఆ పార్టీ నేతలు ఆలస్యంగా గ్రహిస్తున్నారు.

Written By: , Updated On : January 30, 2025 / 06:05 PM IST
Kethireddy Venkatarami Reddy (1)

Kethireddy Venkatarami Reddy (1)

Follow us on

Kethireddy Venkatarami Reddy: సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ( YSR Congress )దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఎన్నికలకు ముందే జగన్ సర్కార్ పై వ్యతిరేకత ఉంది. అది వైసీపీ నేతలకు కూడా తెలుసు. అయితే సంక్షేమ పథకాలతో గట్టెక్కుతామని వైసిపి నేతలు భావించారు. కానీ ఊహించని భారీ పరాజయం ఎదురయింది. దానిని వైసీపీ నేతలు కూడా జీర్ణించుకోలేకపోయారు. కనీసం బోటా బోటి మెజారిటీతో గెలుస్తామనుకుంటే.. ఇలా ఓడిపోయాం ఏంటని చాలా బాధపడిపోయారు. కొద్దిరోజుల వరకు వారు బయటకు వచ్చేందుకు కూడా ఇష్టపడలేదు. అయితే కొందరు నేతలు మాత్రం ఈవీఎంలపై ఆరోపణలు చేశారు. అటువంటి నేతలకు ఇప్పుడు తత్వం బోధపడుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఇప్పుడు గుర్తించడం ప్రారంభించారు. ఇప్పుడు వైసీపీ కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా అసలు విషయాన్ని గ్రహించారు. ఇప్పుడిప్పుడే వైసీపీ తప్పిదాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

* కచ్చితంగా గెలుస్తారని భావిస్తే
రాష్ట్రంలో వైసీపీ నుంచి గెలవాల్సిన నేతల్లో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి( kethi Reddy Venkat Rama Reddy ) ఒకరు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన నిర్వహించిన కార్యక్రమం సక్సెస్ అయ్యింది. మిగతా ప్రజాప్రతినిధులకు సైతం ఆదర్శంగా నిలిచింది. సోషల్ మీడియాలో ఆయన ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ఉంటే ఇలాంటి ఎమ్మెల్యే ఉండాలి అనే పరిస్థితికి వచ్చింది. అయినా సరే ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. కొద్ది రోజులపాటు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గణాంకాలతో ఆయన ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే క్రమేపి ఆయన వాస్తవాలకు దగ్గరగా వస్తున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో తప్పిదాలే ఓటమికి కారణమని ఒప్పుకుంటున్నారు. జగన్ సర్కార్ వైఫల్యాలను బయటపెట్టేందుకు వెనుకడుగు వేయడం లేదు. అయితే ఇది వైసీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు.

* సంచలన కామెంట్స్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి( Venkat Ram Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన తప్పిదాలే తమ పార్టీ ఓటమికి కారణమని ఒప్పుకున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత కామెంట్స్ చేయడం పార్టీకి మైనస్ గా మారిందని అన్నారు. కూటమిలో ఐక్యత పెరగడానికి అవే కారణమయ్యాయి అని కూడా విశ్లేషించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడం అతిపెద్ద తప్పుగా అభివర్ణించారు. చంద్రబాబును అరెస్టు చేయాలనుకుంటే.. మరోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆలోచించాల్సిందని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆ పని చేయడం ప్రభావం చూపిందని కూడా విశ్లేషించారు.

* టీడీపీ ఆఫీస్ పై దాడి తప్పే
వైసిపి హయాంలో తెలుగుదేశం ( Telugu Desam)పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి చేయడం కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచిందన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం… తెలుగుదేశం పార్టీకి టర్నింగ్ పాయింట్ అయిందన్నారు. పవన్ కళ్యాణ్ హ్యాండిల్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. ఆయనను అడుగడుగునా అడ్డగించడంతో జనసైనికుల్లో ఒక రకమైన కసి పెరిగిందని గుర్తు చేశారు కేతిరెడ్డి. చంద్రబాబుకు జరిగిన అవమానంతో ఆయన సొంత సామాజిక వర్గం రగిలిపోయిందని.. ఆత్మాభిమానం అన్న నినాదంతో పనిచేసిందని గుర్తు చేశారు కేతిరెడ్డి. అయితే స్వరం మార్చుకుంటూ నర్మగర్భంగా.. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.