https://oktelugu.com/

Sabdham Movie Review: ‘శబ్దం’ ఫుల్ మూవీ రివ్యూ…

Sabdham Movie Review నటుడు 'ఆది పినిశెట్టి'... ఆయన విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే అప్పుడప్పుడు హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటిస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన చేసిన 'శబ్దం ' (Shabdham) సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Written By: , Updated On : February 28, 2025 / 10:08 AM IST
Sabdham Movie Review

Sabdham Movie Review

Follow us on

Sabdham Movie Review: సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నప్పటికీ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించి తెలుగులో సైతం విలక్షణమైన నటుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ‘ఆది పినిశెట్టి’… ఆయన విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే అప్పుడప్పుడు హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటిస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన చేసిన ‘శబ్దం ‘ (Shabdham) సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నమైతే చేద్దాం…

 

Also Read: రాజమౌళి.. శ్రీను.. ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ?

 

కథ

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక ఓల్డ్ కాలేజీలో రెండు మర్డర్స్ అయితే జరుగుతాయి. ఇక ఆ మర్డర్స్ వెనుక ఎవరున్నారు? ఎందుకోసం ఆ మర్డర్స్ చేయాల్సి వచ్చింది అనే విషయాలను తెలుసుకోవడానికి ఆది పినిశెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తు ఉంటాడు. ఈ ప్రాసెస్ లో ఆయనకు ఎదురైన సంఘటనలు ఏంటి? తనను చంపాలనుకున్న వారు ఎవరు తనకి ఉన్న లింక్ ఏంటి అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఈ సినిమా దర్శకుడైన అరవిలగన్ ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించడానికి ఈ సబ్జెక్ట్ ని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే కథలో ఆయన పర్ఫెక్ట్ గా సినిమాని పొట్రే చేయాలనే ప్రయత్నం చేసినప్పటికి అక్కడక్కడ కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉండడం, టైట్ స్క్రీన్ ప్లే ని రాసుకోకపోవడం ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి కొంతవరకు ఇబ్బందిని కలిగిస్తుంది. ప్రతి సీన్ ని ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికి రైటింగ్ లోనే చాలా వరకు మిస్టేక్స్ అయితే ఉన్నాయి.

అందువల్ల ఈ సినిమా చూస్తున్నంత సేపు ఓకే అనిపించినప్పటికి సినిమా మొత్తం చూసిన తర్వాత కొన్ని డౌట్లు మాత్రం ప్రేక్షకుడి మైండ్ లో అలాగే ఉండిపోతాయి వాటికి క్లారిటీ ఇస్తే బాగుండేది. దర్శకుడు మాత్రం అనవసరమైన సీన్లను ఆడ్ చేస్తూ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడం పక్కన పెట్టేసి విజువల్స్ ద్వారా ప్రేక్షకుడిని మాయ చేయాలనే ప్రయత్నం చేశాడు. కానీ విజువల్స్ సైతం అంత గొప్పగా ఏమీ లేవు… మొత్తానికి ఫస్ట్ హఫ్ లో క్యారెట్రైజేషన్స్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం అయితే బావుంది. అదోక్కటి మినహాయిస్తే సెకండ్ హాఫ్ లో దానికి కన్ క్లూజన్ ఇచ్చే ప్రయత్నంలో ఆయన స్టోరీ నుంచి అవుట్ సైడ్ వెళ్లిపోయి ఎక్కడో స్టార్ట్ అయిన స్టోరీని ఇంకెక్కడో ఎండ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. దీనివల్ల ప్రేక్షకుడికి ఎంగేజింగ్ గా అనిపించకపోగా కొన్నిసార్లు బోర్ గా ఫీల్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.

ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొంతవరకు బోర్ ఫీల్ అయ్యే ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి అవన్నీ లేకుండా టైట్ స్క్రీన్ ప్లే తో ముందుకు సాగితే మాత్రం ఈ సినిమా బెస్ట్ అటెంప్ట్ గా మిగిలిపోయేది.ఆది పినిశెట్టి అరివిలగన్ కాంబోలో ఇంతకుముందు ‘వైశాలి’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇద్దరికీ మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చింది. మరి ఈ సినిమా ఆ రేంజ్ లోనే ఉంటుంది అంటూ ప్రమోషన్స్ చేసినప్పటికి దర్శకుడు చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఈ సినిమా బిలో ఆవరేజ్ గా మిగిలిందనే చెప్పాలి…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఆది పినిశెట్టి ఒక డీసెంట్ పాత్రను పోషించాడమే కాకుండా అందులో చాలా అద్భుతమైన పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. ఇలాంటి పాత్రలను పోషించడం ఆయనకు కొత్తేమీ కాదు. సెటిల్డ్ పర్ఫమెన్స్ ఇస్తూ తన పాత్రకి ఒక ఐడెంటిటిని తీసుకురావడంలో ఆది పినిశెట్టి మొదటి నుంచి కూడా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించడానికి ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. ఇక సిమ్రాన్ పాత్ర కొంతవరకు ఇబ్బంది కలిగించింది. ఆమె అక్కడక్కడా తన క్యారెక్టరైజేషన్ లిమిట్స్ క్రాస్ చేసి బయటికి వెళ్లినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మిగిలిన ఆర్టిస్టులందరు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

 

Also Read: కథ ఎన్టీఆర్ కి నచ్చింది, బాలయ్యకు నచ్చలేదు… కట్ చేస్తే రిజల్ట్ చూసి అందరూ షాక్!

 

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాల విషయానికి వస్తే తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించినప్పటికి అంత పెద్దగా మ్యూజిక్ అయితే ఎలివేట్ అవ్వలేదనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అక్కడక్కడ కొంత ఇబ్బంది కలిగించినప్పటికి ఓవరాల్ గా ఒక చిన్న సినిమాకి ఎలాంటి మ్యూజిక్ అయితే కావాలో అలాంటి మ్యూజిక్ ని అందించడంలో తమన్ కూడా చాలా వరకు కృషి అయితే చేశాడు. ఇక విజువల్స్ పరంగా కొంతవరకు మెప్పించినప్పటికి ఓవర్ ద టాప్ విజువల్స్ అయితే లేవనే చెప్పాలి… ఎడిటర్ తన కత్తెరకు మరికొంత పని పెట్టి ఉంటే బాగుండేది కొన్ని అనవసరమైన సీన్లని ఎత్తేసి సినిమాని గ్రిప్ంగ్గా మారిస్తే ఇంకా బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నంతలో ఓకే అనిపించాయి…

ప్లస్ పాయింట్స్

ఆది పినిశెట్టి
ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్

లాజిక్ లేని సీన్స్
సెకండ్ హాఫ్
స్క్రీన్ ప్లే

రేటింగ్

ఈ సినిమాకి మెమిచ్చే రేటింగ్ 2/5

 

Sabdham (Telugu) - Official Trailer | Aadhi | Lakshmi Menon | Thaman.S | Arivazhagan  | 7G Siva