https://oktelugu.com/

N T Rama Rao: ఎన్టీఆర్ కు భారతరత్న.. ఈ ఏడాదైనా సాధ్యమేనా?

N T Rama Rao నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇవ్వాలన్నది దశాబ్దాల డిమాండ్. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.

Written By: , Updated On : February 28, 2025 / 10:19 AM IST
N T Rama Rao

N T Rama Rao

Follow us on

N T Rama Rao: తెలుగు వారి కీర్తి ప్రతీక.. నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ). ఆయన ఓ లెజెండ్రీ. సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లోనూ సరికొత్త ఒరవడి సృష్టించారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ ఆయనది చెరిగిపోని రికార్డ్. నిమ్మకూరులో పుట్టిన ఆయన సినిమాల్లో నటించాలని మదరాసు వెళ్లారు. అనతి కాలంలోనే పౌరాణిక పాత్రలు పోషించి దేవుడు అంటే ఇలా ఉంటాడు అనేలా.. తన నటనతో మెప్పించారు. తెలుగువారి అభిమాన హీరోగా ఎదిగి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అశేష ప్రేక్షకులను మెప్పించారు. అటు రాజకీయరంగంలో అడుగుపెట్టి.. పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చారు. సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ప్రజల మనసును చురగొన్నారు. జాతీయ స్థాయిలో సైతం చెరగని ముద్ర వేశారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తికి భారతరత్న అవార్డు రాకపోవడం నిజంగా లోటు.

Also Read: నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ ఎంపీ.. రెడ్ బుక్ లో ఉన్నది ఆయన పేరే?

1982లో తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party) పురుడు పోసుకుంది. పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చింది. అసలు రాజకీయమే తెలియని చాలామంది తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి చట్టసభల్లో అడుగుపెట్టారు. ఓ విధంగా చరిత్రను తిరగరాశారు ఎన్టీఆర్. సినిమా వాడు ఏం చేయగలడు? అనే మాటలకు దీటైన సమాధానం చెప్పారు ఎన్టీఆర్. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పికిలించారు. జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలకు దిక్సూచిగా నిలిచారు. కూటమిల ద్వారా జాతీయస్థాయిలో.. జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలను నడిపించిన చరిత్ర ఎన్టీఆర్ ది. అటువంటి మహోన్నత వ్యక్తి 1996లో మృతి చెందారు. అయితే ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ మాత్రం ఇంతవరకు సాకారం కాలేదు.

* దశాబ్దాల డిమాండ్
నందమూరి తారక రామారావుకు భారతరత్న( Bharat Ratna) పురస్కారం ప్రకటించాలన్నది దశాబ్దాల డిమాండ్. గత మూడు దశాబ్దాలుగా ఇది వినిపిస్తూనే ఉంది కానీ కార్యరూపం దాల్చడం లేదు. రకరకాల కారణాలతో ఎన్టీఆర్ కు భారతరత్న అందని ద్రాక్షగా ఉంది. అయితే తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలతో ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తారని అంతా భావించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. అదే సమయంలో ఏపీలో టీడీపీ కూటమితో పాలనను పంచుకుంటోంది బిజెపి. మరోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి ఉన్నారు. ఇన్ని సానుకూలతల నడుమ ఎన్టీఆర్ కు భారతరత్న ఎంత దూరంలో లేదని అంతా భావించారు.

* గత ఏడాది ఒకేసారి ఐదుగురికి..
అయితే ఫిబ్రవరి( February) గడుస్తోంది. ఇంతవరకు భారతరత్న ప్రకటన రాలేదు. గత ఏడాది ఇదే సమయానికి భారతరత్న అవార్డులను ప్రకటించారు. 2019 తర్వాత ఒకేసారి ఐదుగురికి అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం గత ఏడాది. పీవీ నరసింహారావు తో పాటు బిజెపి అగ్రనేత ఎల్కే అద్వానీతో సహా ఐదుగురికి భారతరత్న ఇచ్చింది మోడీ సర్కార్. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఐదుగురు పేర్లు ప్రకటించడం విశేషం. అయితే 2019 తర్వాత భారతరత్న ప్రకటన జారీ కాలేదు. అయితే ఒకేసారి అప్పట్లో ఐదుగురికి అవార్డు ప్రకటించారు.

* ఇటీవల సానుకూల ప్రకటనలు
ఇటీవల చాలా సందర్భాల్లో సీఎం చంద్రబాబు( CM Chandrababu) కూడా ఎన్టీఆర్కు భారతరత్న వస్తుందని చెప్పుకొచ్చారు. బిజెపి ఏపీ పురందేశ్వరి సైతం ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించిన నందమూరి బాలకృష్ణ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. త్వరలో ఎన్టీఆర్కు భారతరత్న వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ కేంద్రం నుంచి మాత్రం ఎటువంటి ప్రకటన, సంకేతాలు రావడం లేదు. దీంతో ఎన్టీఆర్ తో పాటు నందమూరి అభిమానులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

Also Read: బాలయ్యతోనే పెట్టుకుంటారా.. దబిడ దిబిడే.. సీరియస్.. వైరల్ వీడియో