Padutha Theeyaga-Sa re ga ma pa: బుల్లితెరపై ప్రసారమైన పాడుతా తీయగా పాటల షో ప్రేక్షకులకు ఎంత దగ్గరయిందో చూశాం. ఇందులో ఎంతో మంది సినీ నేపథ్య గాయకులు పాల్గొని తమ పాటలతో బాగా ఆకట్టుకున్నారు. పైగా ఎంతో మంది గాయకులు కూడా పరిచయమయ్యారు. ఇక ఈ షో కేవలం ఒక టాలెంట్ ను గుర్తించడం అనే కాన్సెప్ట్ తో ప్రసారం కాగా.. ఇప్పుడు ప్రసారం కానున్న సరిగమప పాటల షో.. పాడుతా తీయగాకు టఫ్ పోటీగా రానుంది.
Padutha Theeyaga-Sa re ga ma paత్వరలో బుల్లితెరపై ప్రసారం కానున్న సరిగమప షో రియాలిటీ షోగా ముందుకు రానుంది. ఇక ఈ షో టాలెంట్ తో పాటు మరికొన్ని డ్రామాలతో ఆకట్టుకునే విధంగా ప్రసారం కానుంది. అంతేకాకుండా శ్రీముఖి ఈ షోకు యాంకర్ గా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఇక జడ్జిల విషయంలో మాత్రం అస్సలు తగ్గలేదని చెప్పాలి. ఎందుకంటే ఈ షోలో కూడా కోటి, శ్రీరామ్, ఎస్ పి శైలజ, స్మితలు ఉన్నారు కాబట్టి.
Also Read: ‘ప్రభాస్ – మారుతి’ సినిమాలో నటించే హీరోయిన్స్ వాళ్లే
కేవలం పాటలే కాకుండా మధ్యమధ్యలో శ్రీముఖి అందించే ఎంటర్టైన్మెంట్ డ్రామాలు మరింత హైలెట్ గా నిలవనున్నాయి. తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో కూడా విడుదల కాగా అందులో ఫుల్ మజా కనిపిస్తుంది. కొత్త కొత్త సింగర్స్ పరిచయం కాగా తమ పాటలతో జడ్జీలతో పాటు ప్రేక్షకులను కూడా ఫిదా చేశారు. ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా తగ్గకుండా తమ స్వరాలతో వేదికపై సందడి చేస్తున్నారు. ఒకవైపు సింగర్స్ క్వాలిటీతో పాటు ఎంటర్టైన్మెంట్ తో కూడా ఈ షో ఓ రేంజ్ లో దూసుకుపోనుంది.
అయితే ఇది వరకు పాడుతా తీయగా కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ టీవీలో ప్రసారం అవుతూ ఎంతో మంది గాయనీ గాయకులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఇక ఈ కార్యక్రమానికి దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఈయన సమక్షంలో ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే ఎస్పీ బాలు గారు మరణం తర్వాత ఈ కార్యక్రమం కూడా ఆగిపోయింది.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని ఎస్పీ బాలసుబ్రమణ్యం వారసుడిగా తన కుమారుడు ఎస్పీ చరణ్ సమక్షంలో నిర్వహించాలని నిర్వాహకులు భావించారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ఈటీవీ ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమానికి సింగర్ సునీత, రచయిత చంద్రబోస్, విజయ్ ప్రకాష్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ చరణ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మందికి సింగర్స్ ఎంతో అద్భుతంగా పాటలు పాడుతూ తమ నైపుణ్యాన్ని బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే పాడుతా తీయగా కార్యక్రమానికి పోటీగా జీ తెలుగులో సరిగమప అనే సింగింగ్ కాంపిటీషన్ ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి కూడా ప్రముఖ సంగీత దర్శకులు రచయితలు సింగర్స్ న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఈ కార్యక్రమం పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్త సింగర్స్ ఒక్కొక్కరు ఒక్కో రీతిలో అద్భుతమైన గాత్రంతో పాటలను పాడుతూ పాటకు అనుగుణంగా హావభావాలను వ్యక్తపరుస్తూ వారు పాడే విధానం చూస్తే తప్పకుండా సరిగమప కార్యక్రమం పాడుతా తీయగా కార్యక్రమానికి గట్టి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు. మరి ఈ రెండు సింగింగ్ కాంపిటీషన్స్ లో ఏది మంచి గుర్తింపు సాధిస్తుందో వేచి చూడాలి.
Also Read: మంచు ఫ్యామిలీని ట్రోల్ చేయడానికి కారణాలు ఇవే
Recommended Video: