S. V. Ranga Rao Rare Photo: ‘విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు’ అంటేనే నిండైన విగ్రహం. ప్రతి తెలుగు ప్రేక్షకుడికి ‘ఎస్వీఆర్’ అనగానే ముందు ఆయన నిండైన రూపమే జ్ఞప్తికి వస్తుంది. మరి ఎస్వీఆర్ కుర్రాడిగా ఉన్నప్పుడు ఎలా ఉండేవారు ?, అసలు, కుర్రతనంలోని ఎస్వీఆర్ రూపురేఖలు ఎలా ఉండేవి ? మీకు కూడా చూడాలని ఆసక్తి కలుగుతుంది కదా. మరి సన్నటి పొడవాటి దేహంలో ‘ఎస్వీఆర్’ ఎలా ఉన్నారో ఒక లుక్కేయండి. కింద కనిపిస్తున్న ఫోటో ‘ఎస్వీఆర్’ తన 18 ఏళ్ల వయసులో తీయించుకున్నది.
సామర్లకోటలోని తన బంధువుల నివాసంలో ఎస్వీఆర్ ఈ ఫోటో తీయించుకున్నారు. ఫోటోలో పొడవాటి దుస్తులతో కనిపించిన ఎస్వీఆర్ నేటి తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నారు. ఇక ఎస్వీఆర్ కుర్ర లుక్ ను ఈ తరం హీరోలతో పోలిస్తే.. అచ్చం ‘విజయ్ దేవరకొండ’లా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఫోటోలో ఎస్వీఆర్ వస్త్రధారణ, 1940 నాటి కాలం ట్రెండ్ కు నిదర్శనంగా నిలిచింది.
Also Read: Crazy News: బాబోయ్.. ఇదెక్కడ దరిద్రం ? ప్రభాస్ కాస్త చెప్పవయ్యా
ఎస్వీఆర్ నటనలో గొప్ప హుందాతనాన్ని, ఆయన స్వరంలో ఘనమైన గాంభీర్యాన్ని.. ఆయన మాటల్లో స్పష్టమైన తెలుగుతనాన్ని.. రానున్న తరాలు కూడా మర్చిపోలేవు. తెలుగు వెండితెర ఏ నాడో చేసుకున్న పుణ్యం కారణంగా, ఆయన మన తెలుగు వాడిగా పుట్టారు. కొంతమంది నటులు నటించక్కర్లేదు, వాళ్ళు కనిపిస్తే చాలు రంగుల సినిమాల్లో ఎన్నో ఎమోషన్స్ ప్లే అవుతాయి.
అలాంటి వారిలో ఎస్వీఆర్ మొదటి వ్యక్తి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ముందు సూపర్ స్టార్లు కూడా చిన్నబోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఒక్కసారి కళ్ళు చిట్లించి చూస్తే, మహా మహా నటులు కూడా హడలిపోయిన సంఘటనలు మరెన్నో ఉన్నాయి. అందుకే ఆయన విశ్వనట చక్రవర్తి అయ్యారు.
ఆ రోజుల్లో ఎస్వీఆర్ పెదవి విరిచి చిన్న హమ్మింగ్ ఇస్తే చాలు.. కొమ్ములు తిరిగిన విలన్లు కూడా వణికిపోయారు. అందుకే, ఎస్వీఆర్ తెర పై కనపడగానే అప్పటి ప్రేక్షకుల చప్పట్లు, ఈలలతో గోల గోల చేసేవారు. ఆయన తల కొద్దిగా ఆడిస్తే చాలు, ఆ చిన్నపాటి రియాక్షన్ కే ప్రేక్షకులు మైమరచి పోయేవారు. ఆయనలో గొప్ప ప్రత్యేకత ఏమిటంటే.. ఆయన మాట పెదవి దాటకుండానే, భావం ఆయన ముఖంలో కనబడుతుంది.
అందుకే ఘటోత్కచుడిగా, రావణుడిగా, కీచకుడిగా, నేపాళ మాంత్రికుడిగా , హిరణ్యకశిపుడిగా, తాతయ్యగా, తండ్రిగా, మామయ్యగా ఇలా ఒకటి ఏమిటి ?, ఎన్నో ఎన్నెన్నో వైవిధ్యమైన పాత్రలు ఆయన పాదాల చెంత సేద తీరాయి. అలాగే మరెన్నో విభిన్న పాత్రలు ఆయన మోకాళ్ళ దగ్గర కాలక్షేపం చేశాయి. ఎస్వీఆర్ చివరి వరకు నటనే శ్వాసగా జీవించారు. పైగా నటిస్తూనే తుదిశ్వాస విడిచారు.
‘సాహసం సాయరా డింభకా రాకుమారి దక్కునురా’ ఈ డైలాగ్ ఇప్పటికీ ఫేమసే. డెబ్బై సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా డైలాగ్ ఇది. అయినా ‘పాతాళ భైరవి’ అనే సినిమా ఈ రోజుకూ తెలుగులో వచ్చిన గొప్ప ఫాంటసీ సినిమాగానే నిలిచిపోయింది అంటే ప్రధాన కారణం.. ఎస్వీఆరే. అందుకే.. ఎన్టీఆర్ సైతం ఎస్వీఆర్ అంటే ప్రత్యేక అభిమానం చూపించే వారు.
Also Read:Star Heroine: స్టార్ హీరోయిన్ ప్రేమ పాఠాలు.. కుర్రాళ్ళ ఉత్సాహం