Avatar: The Way of Water: ‘అవతార్ -2’ రిలీజ్ ఎన్ని దేశాల్లో తెలుసా..? ఇది ప్రపంచ రికార్డు

Avatar: The Way of Water: ప్రపంచ సినీ లోకాన్ని తమ విన్యాసాలతో సాహసాలతో ఎంతగానో అలరించింది ‘అవతార్’ చిత్రం. మొత్తానికి మన తెలుగు సినిమాల పై కూడా ‘అవతార్’ సినిమా ప్రభావం ఎంతగానో ఉంది. అత్యధిక థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘అవతార్’ కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తన గ్రాఫిక్స్‌తో కొత్త ప్రపంచాన్నే ప్రేక్షకులకు చూపించాడు జేమ్స్ కామెరాన్. అందుకే “అవతార్” అంటే ప్రతి సినీ ప్రేమికుడికి […]

Written By: Shiva, Updated On : May 10, 2022 7:14 pm
Follow us on

Avatar: The Way of Water: ప్రపంచ సినీ లోకాన్ని తమ విన్యాసాలతో సాహసాలతో ఎంతగానో అలరించింది ‘అవతార్’ చిత్రం. మొత్తానికి మన తెలుగు సినిమాల పై కూడా ‘అవతార్’ సినిమా ప్రభావం ఎంతగానో ఉంది. అత్యధిక థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘అవతార్’ కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తన గ్రాఫిక్స్‌తో కొత్త ప్రపంచాన్నే ప్రేక్షకులకు చూపించాడు జేమ్స్ కామెరాన్.

Avatar: The Way of Water

అందుకే “అవతార్” అంటే ప్రతి సినీ ప్రేమికుడికి ఎంతో ప్రత్యేకం. ఇంతకు ముందెన్నడూ చూడని కొత్త ప్రపంచాన్ని ఈ సినిమాలో చూశారు సినీ ప్రియులు. అందుకే, ఈ సినిమా రెండవ పార్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా పడిగాపులు కాస్తున్నారు. గతంలో, ఏ సినిమాకి లేనంత బజ్ ఈ సినిమా సెకండ్ పార్ట్ పై ఉంది. మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “అవతార్ 2” ట్రైలర్ టీజర్ అయిన సంగతి తెలిసిందే.

Also Read: S. V. Ranga Rao Rare Photo: ‘ఎస్వీఆర్’ చిన్ననాటి ఫోటో.. వావ్ అచ్చం ‘విజయ్ దేవరకొండ’లా ఉన్నాడు

“అవతార్ 2” ట్రైలర్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ.. సరికొత్త రికార్డ్ లను సృష్టిస్తోంది. ఈ ట్రైలర్ అందరిలోనూ ఆస‌క్తి డబుల్ చేసింది. ఈ టీజ‌ర్ ట్రైల‌ర్‌ లో సినిమా మెయిన్ పాయింట్ ను చాలా బాగా ఎలివేట్ చేశారు. అవ‌తార్‌ లో భూమి కోసం ఎలా అయితే పోరాటం చేశారో.. ఈ అవ‌తార్ 2లో నీటి కోసం అలాగే యుద్ధం చేస్తారు. ఈ టీజ‌ర్ ట్రైల‌ర్‌ తో తన సినిమా దేని పైన ఉండబోతుందని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు జేమ్స్ కామెరూన్‌.

Avatar: The Way of Water

ఇక టీజ‌ర్ ట్రైల‌ర్‌ లో అయితే, విజువ‌ల్స్ స్ట‌న్నింగ్‌ గా ఉన్నాయి. పండోరా గ్ర‌హంలోనే జేమ్స్ కామెరూన్ మ‌రో అద్భుత‌మైన లోకాన్ని సృష్టించాడు. మరి ఇంత భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎన్ని దేశాల్లో రిలీజ్ అవ్వబోతుందో తెలుసా ?

దాదాపు 163 దేశాల‌కు పైగానే అవ‌తార్ 2 చిత్రాన్ని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇన్ని భాష‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా రిలీజ్ కాలేదు. రిలీజ్ లో కూడా ఈ చిత్రం ప్రపంచ రికార్డును క్రియేట్ చేయబోతుంది. ఇక, అవ‌తార్ 3, అవ‌తార్ 4, సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయ‌నేది.. అవ‌తార్ 2 రిలీజ్ త‌ర్వాత క్లారిటీ రానుంది.

Also Read:NTR- Inter Exams: ఇంటర్ ఎగ్జామ్స్‌ లో జూ. ఎన్టీఆర్‌ పై ప్రశ్న.. కారణం అదే !

Tags