మెగాస్టార్ సిస్టర్ పాత్ర పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. ఇంతకీ ఈ సిస్టర్ గోల ఏంటి అనుకుంటున్నారా.. మెగాస్టార్ ‘లూసిఫర్’లో హీరోకి చెల్లి పాత్ర ఉంటుంది. అయితే మలయాళంలో మంజు వార్యర్ ఆ పాత్రలో అద్భుతంగా నటించింది. చిన్నప్పటి నుండి తెలియకుండానే హీరో పై ద్వేషంతో రగిలిపోతూ.. చివరికి హీరో సాయం కోరే ఆ ఎమోషనల్ రోల్ లో కుష్బూ నటించబోతున్నట్లు, లేదూ రోజా చేస్తోందని, కొన్ని రోజులు అయితే ఏకంగా విజయశాంతినే చేస్తోందని, ఈ మధ్యలో సుహాసిని కూడా ఆ రోల్ కు ఫిక్స్ అయిందని ఇలా ఈ సినిమా అనుకున్న దగ్గర నుండి రూమర్స్ కు అడ్డుఅదువు లేకుండా పోయింది. అసలు ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించి ఎవర్నీ ఫైనల్ చేయలేదు. ఆ మాటకొస్తే ఫుల్ స్క్రిప్ట్ కూడా ఇంకా ఫైనల్ కాలేదు.
చిరు ‘ఆచార్య’ ఆఫర్కు సాయి పల్లవి నో!
కానీ రాతల రాయుళ్లు మాత్రం వాళ్లకు వాళ్లే క్యాస్టింగ్ ను ఫైనల్ చేసేసి.. ఫలానా రోజు ఓపెనింగ్, ఫలానా రోజు షూటింగ్ అంటూ అర్థంపర్ధం లేని గాసిప్స్ రాసి జనం మీదకు వదులుతున్నారు. అందుకే వీటిలో ఏ ఒక్కటి నిజం కాదని చిత్రబృందమే తెలుపుతుంది. ఆయితే ఈ పాత్రకు మాత్రం కుష్బూ పర్ఫెక్ట్ గా సరిపోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి కుష్బూ గ్లామర్ హీరోయిన్ అయినప్పటికీ మంచి గ్రేస్ ఉన్న ఫిజిక్.. పైగా డామినేట్ చేసే అటిట్యూడ్.. చెల్లి పాత్రకు ఇలాంటి ఫీచర్స్ ఉన్న నటినే కావాలి. సో.. కుష్బూ తప్ప ఇక ఆ పాత్రకు మరో అప్షన్ లేకపోవచ్చు. కానీ ఆ ఎమోషనల్ రోల్ కు సుహాసిని కూడా పూర్తి న్యాయం చేయగలదని పైగా మెగాస్టార్ కి సిస్టర్ గా సుహాసిని ఆయితేనే బాగుంటుందని టాక్ వినిపిస్తోంది.
ఇక మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీని.. తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారు. ఎలాగూ సినిమాలో మెగాస్టార్ హీరోయిజమ్ ఎలివేషన్స్ భీభత్సంగా ఉంటాయి. పైగా మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా యాక్షన్ సీక్వెన్స్ ను తీయడంలో సుజీత్ మంచి టాలెంట్ ఫెలో. అయితే, గత ఏడాది సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన సాహో ప్రభాస్ రేంజ్ ను తగ్గించింది. అయినా, మెగాస్టార్, సుజీత్ టాలెంట్ పై నమ్మకముంచి అతనికి ఈ భారీ సినిమా అవకాశం ఇచ్చారు.