https://oktelugu.com/

Karthika Deepam: హిమను మరో రుద్రాణిగా చేయనున్న రుద్రాణి.. మరో పది రోజుల్లో అంటూ షాక్ ఇచ్చిన మోనిత!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. హాస్పిటల్ లో రౌడీ పరిస్థితి బాగా లేకపోవడంతో కార్తీక్ బాగా ఆందోళన పడతాడు. ఎలాగైనా తన కూతుర్ని రక్షించుకోవాలని అనుకొని తనకు సెలైన్ బాటిల్ పెడతాడు. అక్కడ సీసీ ఫుటేజీ ద్వారా లోపల ఉన్న డాక్టర్.. కార్తీక్ వాళ్ళు ఏం చేస్తున్నారో అని గమనించి అక్కడికి వస్తుంది. ఇక ఇక్కడ కార్తీక్ చేస్తున్న ట్రీట్మెంట్ ను చూసి బాగా ఫైర్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 2, 2022 / 07:45 AM IST
    Follow us on

    Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. హాస్పిటల్ లో రౌడీ పరిస్థితి బాగా లేకపోవడంతో కార్తీక్ బాగా ఆందోళన పడతాడు. ఎలాగైనా తన కూతుర్ని రక్షించుకోవాలని అనుకొని తనకు సెలైన్ బాటిల్ పెడతాడు. అక్కడ సీసీ ఫుటేజీ ద్వారా లోపల ఉన్న డాక్టర్.. కార్తీక్ వాళ్ళు ఏం చేస్తున్నారో అని గమనించి అక్కడికి వస్తుంది.

    ఇక ఇక్కడ కార్తీక్ చేస్తున్న ట్రీట్మెంట్ ను చూసి బాగా ఫైర్ అవుతుంది. కార్తీక్ బాధపడుతూ ఎలాగైనా తన కూతురుని కాపాడుకోవాలని డాక్టర్ ను వేడుకుంటాడు. కానీ తాను మొదట్లో నిరాకరిస్తుంది. ఆ తర్వాత దీప, కార్తీక్ బ్రతిమాలడంతో ఏర్పాట్లు చేస్తానని అంటుంది. మరోవైపు ఆదిత్య, శ్రావ్య వాళ్లు బయట ఉండగా వారికి మోనిత ఎదురుపడి నోటికొచ్చిన మాటలతో అరుచుకుంటూ పోతుంది.

    ఇక మరో పది రోజుల్లో కార్తీక్ ను, బాబును మీముందుకు తీసుకొని వస్తాను అని ఆదిత్య వాళ్లకు షాక్ ఇస్తోంది. ఇక రుద్రాణి కూడా దీప వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. హిమను సొంతం చేసుకొని తనను మరో రుద్రాణిగా మారుస్తానని గట్టిగా ఫిక్స్ అవుతుంది. హాస్పిటల్లో డాక్టర్ సౌర్య రిపోర్ట్స్ చూసి తనకు ఇది వరకు ఆపరేషన్ జరిగిందని అంటాడు. ఇక కార్తీక్ కూడా జరిగిందని.. ఆ ఆపరేషన్ డాక్టర్ కార్తీక్ చేశాడని అంటాడు.

    వెంటనే ఆ డాక్టర్లు కార్తీక్ పేరు విని షాక్ అవుతారు. అంత గొప్ప డాక్టర్ అపాయింట్మెంట్ దొరికిందా అని షాక్ అవుతారు. అక్కడున్న డాక్టర్ ఈ ఆపరేషన్ డాక్టర్ కార్తీక్ మాత్రమే చేస్తాడని చేతులు వదిలేస్తాడు. దీంతో దీప.. తను డాక్టర్ కార్తీక్ ను పిలిపించుకుంటానని అంటుంది. తరువాయి భాగం లో దీప.. కార్తీక్ కాలు పట్టుకొని బ్రతిమాలుతుంది. ఇక కార్తీక్ తన కూతురుకు ఆపరేషన్ చేయటానికి ముందుకు వస్తాడు.