https://oktelugu.com/

Karthika Deepam: పిల్లలపై ప్రేమ పెంచుకుంటున్న రుద్రాణి.. భయంతో వణికిపోతున్న కార్తీక్!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. మోనిత భోజనం చేయడానికి హోటల్ కి రావడంతో అక్కడ మోనిత బేరర్ తో మాట్లాడుతున్న మాటలు విని కార్తీక్ కు అనుమానం వస్తుంది. వెంటనే మోనితను చూసి షాక్ అవుతాడు. ఇక్కడికి వచ్చింది ఏంటి అని ఊరు వదిలి వెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ రుద్రాణికి ఇచ్చిన ఒప్పందం గుర్తుకు వస్తుంది. ఇక మోనిత తనను చూసినట్లుగా భయపడతాడు. కానీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 13, 2022 / 09:58 AM IST
    Follow us on

    Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. మోనిత భోజనం చేయడానికి హోటల్ కి రావడంతో అక్కడ మోనిత బేరర్ తో మాట్లాడుతున్న మాటలు విని కార్తీక్ కు అనుమానం వస్తుంది. వెంటనే మోనితను చూసి షాక్ అవుతాడు. ఇక్కడికి వచ్చింది ఏంటి అని ఊరు వదిలి వెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ రుద్రాణికి ఇచ్చిన ఒప్పందం గుర్తుకు వస్తుంది.

    ఇక మోనిత తనను చూసినట్లుగా భయపడతాడు. కానీ మోనిత కార్తీక్ ను చూడదు. ఇక కార్తీక్ ను ఆర్డర్ చేసిన ఫుడ్డు ని అప్పు తెమ్మని అనడంతో కార్తీక్ అక్కడికి వెళ్లాల్సి ఉంటుందన్న భయంతో తన చేతికి గాయం చేసుకుంటాడు. ఆ తర్వాత అప్పునే తీసుకెళ్తాడు. ఇక దీప దగ్గరికి మహాలక్ష్మి వచ్చి రుద్రాణి విషయంలో జాగ్రత్తగా ఉండమని.. ఎందుకంటే తను పిల్లలకు బట్టలు కూడా తన దగ్గర కుట్టిస్తుందని అనడంతో దీప షాక్ అవుతుంది.

    అదే సమయంలో ఇంట్లో కోటేష్ పెట్టె పై నుండి కింద పడటంతో అందులో కోటేష్ రాసుకున్న లెక్కలను చూస్తుంది. అంతేకాకుండా మోనిత కారు నెంబర్ రాసుకోని క్షమించండి మేడం అని రాసుకొని ఉంటాడు. అది చూసి దీప ఆలోచనలో పడుతుంది. హోటల్ లో మోనిత భోజనం చేసి వెళ్ళాక కార్తీక్ కాస్త కుదుట పడతాడు. ఇక సౌందర్య వాళ్ళు ప్రకృతి వైద్యశాల లో తమ సమయాన్ని గడుపుతూ ఉంటారు.

    ఇక వారి దగ్గరికి ఓ వ్యక్తి వచ్చి మీతో పాటు వెనకాల ఎర్ర కారులో మీవాళ్ళు వచ్చారు కదా అనడంతో సౌందర్య మోనితనేమో అని ఆలోచనలో పడుతుంది. కానీ ఆనంద రావు తను కాదని అంటాడు. ఇక దీప తన పిల్లల విషయంలో రుద్రాణి అలా చేయటంతో తిరిగి దీప తనకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని రుద్రాణి వాళ్ల ఇంట్లోకి వెళ్లి ఏకంగా వంట చేస్తుంది. అది చూసి రుద్రాణి షాక్ అవుతూ మండిపోతుంది.