https://oktelugu.com/

Rich Tamil Heroes: రజనీ నుంచి కార్తీ వరకూ.. తమిళ సంపన్నులైన హీరోల లిస్ట్ ఇదే !

Rich Tamil Heroes: తమిళ తెర పై ఎల్లప్పుడూ సమాజం పై ప్రేక్షకుల పై బలమైన ముద్ర వేసే సినిమాలు, వెబ్ సిరీస్‌ లే ఎక్కువుగా వస్తూ ఉంటాయి. అందుకు ప్రధాన కారణం.. ఆ చిత్రాల కథానాయకుల విభిన్న శైలితో పాటు బాక్సాఫీస్ పై వారికీ ఉన్న పట్టు కూడా ఓ కారణం. ఏ వినూత్న సినిమా తీసినా ఆ కథలో ఆ కథానాయకుడిని తమిళ ప్రజలు ఆదరిస్తారు. అందుకే, తమిళ హీరోల చిత్రాల కొత్తదనంతో పాటు […]

Written By:
  • Shiva
  • , Updated On : January 13, 2022 / 10:02 AM IST

    Rich Tamil Heroes

    Follow us on

    Rich Tamil Heroes: తమిళ తెర పై ఎల్లప్పుడూ సమాజం పై ప్రేక్షకుల పై బలమైన ముద్ర వేసే సినిమాలు, వెబ్ సిరీస్‌ లే ఎక్కువుగా వస్తూ ఉంటాయి. అందుకు ప్రధాన కారణం.. ఆ చిత్రాల కథానాయకుల విభిన్న శైలితో పాటు బాక్సాఫీస్ పై వారికీ ఉన్న పట్టు కూడా ఓ కారణం. ఏ వినూత్న సినిమా తీసినా ఆ కథలో ఆ కథానాయకుడిని తమిళ ప్రజలు ఆదరిస్తారు. అందుకే, తమిళ హీరోల చిత్రాల కొత్తదనంతో పాటు కమర్షియల్ గానూ సక్సెస్ అవుతాయి.

    ఆ సక్సెస్ కారణంగా తమిళంలో చాలామంది హీరోలు అత్యంత సంపన్నులైన నటుల లిస్ట్ లో చేరారు. మరి వాళ్లెవరో చూద్దామా !

    కమల్ హాసన్

    కమల్ హాసన్ టాలెంట్ గురించి, ఆయనలోని బహుముఖ కళాకారుడి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. పైగా కమల్ మంచి బిజినెస్ మెన్ కూడా. అందుకే, కమల్ హాసన్ నికర ఆస్తుల విలువ 100 మిలియన్ డాలర్లు.

    రజనీకాంత్

    Rajinikanth-Rama Prabha

    రజనీకాంత్ ఎంత పెద్ద స్టారో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సూపర్ స్టార్ కి భారీ అభిమాన గణం ఉంది. పైగా చాలా ఏళ్ల నుంచి తమిళ తెర పై నీరాజనాలు అందుకుంటున్నాడు. కాగా తాజా నివేదిక ప్రకారం, రజనీకాంత్ నికర ఆస్తుల విలువ $ 50 మిలియన్ల డాలర్లు.

    విజయ్

    ప్రస్తుతం తమిళనాట నంబర్ వన్ హీరో. విజయ్ దళపతిగా తిరుగులేని మాస్ హీరో. అందుకే, అత్యంత ధనిక తమిళ నటులలో ఒకడిగా విజయ్ కి చోటు దక్కింది. కాగా ఈ దళపతి నికర ఆస్తుల విలువ $56 మిలియన్ల డాలర్లు.

    సూర్య

    ‘జై భీమ్’తో తాజాగా మరో గొప్ప హిట్ అందుకున్నాడు సూర్య. నవరస నట చక్రవర్తిగా సూర్యకి మంచి పేరు ఉంది. పైగా మంచి నిర్మాత కూడా. సినీ వర్గాల్లో ఈ హీరో ఒక ఐకాన్‌ కూడా. కాబట్టి, అత్యంత సంపన్నులైన నటుల లిస్ట్ లో సూర్య కూడా ఉన్నాడు. సూర్య నికర ఆస్తుల విలువ 25 మిలియన్ డాలర్లు.

    ధనుష్

    Dhanush

    ధనుష్ సూపర్ స్టార్ అల్లుడుగా కంటే.. అద్భుతమైన నటుడిగానే ధనుష్ గొప్ప పేరు తెచ్చుకున్నాడు. పైగా ధనుష్ నిర్మాత కూడా. ఎక్కువ సక్సెస్ లు చూసిన నిర్మాత. అందుకే.. ధనుష్ నికర ఆస్తుల విలువ $ 20 మిలియన్ డాలర్లు.

    విక్రమ్

    మోడలింగ్‌ తో తన సినీ కెరీర్‌ ను ప్రారంభించాడు విక్రమ్. ఆ తర్వాత అద్భుతమైన చిత్రాలతో స్టార్ హీరో అయ్యాడు. విక్రమ్ కి హోటల్స్ కూడా ఉన్నాయి. తాజా నివేదిక ప్రకారం, ఈ హీరో నికర ఆస్తుల విలువ $ 20 మిలియన్ల డాలర్లు.

    Also Read:  అలా తింటే విషపదార్థాలు తిన్నట్టే.. ఈ జాగ్రత్తలు పాటించండి !

    అజిత్ కుమార్

    అజిత్ కూడా తమిళనాట నంబర్ వన్ హీరోల లిస్ట్ లోనే ఉంటాడు. తాజా నివేదిక ప్రకారం, అజిత్ నికర ఆస్తుల విలువ $25 మిలియన్ల డాలర్లు.

    విజయ్ సేతుపతి

    విజయ్ సేతుపతి తన కెరీర్‌ ను చాలా చిన్నగా స్టార్ట్ చేశాడు. విమర్శకుల నుంచి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన నటుడు కూడా. కాగా తాజాగా నివేదిక ప్రకారం, విజయ్ సేతుపతి నికర ఆస్తుల విలువ $12-15 మిలియన్ల డాలర్లు.

    కార్తీ శివకుమార్

    తన నటనతో కార్తీ శివకుమార్‌ సౌత్ ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా సాధించాడు. నటనలో కార్తీకి ఉన్న పట్టు అది. మంచి చిత్రాలతో విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందిన హీరో కార్తీ. కాగా కార్తీ నికర ఆస్తుల విలువ $12-13 మిలియన్ల డాలర్లు.

    Also Read:  పిల్లలపై ప్రేమ పెంచుకుంటున్న రుద్రాణి.. భయంతో వణికిపోతున్న కార్తీక్!

    Tags