https://oktelugu.com/

‘రామారావు’ లుక్ తో అదరగొట్టిన ‘రవితేజ’ !

‘రామారావు’ ఆన్ డ్యూటీ అంటున్నాడు రవితేజ. మాస్ మహారాజాగా ఫుల్ మాస్ టైటిల్ తో వస్తాడు అనుకుంటే.. రవితేజ మాత్రం తన 68వ సినిమాకి రామారావు అనే ఓల్డ్ అండ్ క్లాసిక్ టైటిల్ తో ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాడు. తాజాగా వదిలిన ఈ ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఫ్యాన్స్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. పైగా పోస్టర్ లో వినూత్నంగా రాసుకొచ్చిన మ్యాటర్ కూడా సినిమా పై ఆసక్తిని […]

Written By:
  • admin
  • , Updated On : July 12, 2021 / 10:35 AM IST
    Follow us on

    ‘రామారావు’ ఆన్ డ్యూటీ అంటున్నాడు రవితేజ. మాస్ మహారాజాగా ఫుల్ మాస్ టైటిల్ తో వస్తాడు అనుకుంటే.. రవితేజ మాత్రం తన 68వ సినిమాకి రామారావు అనే ఓల్డ్ అండ్ క్లాసిక్ టైటిల్ తో ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాడు. తాజాగా వదిలిన ఈ ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఫ్యాన్స్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. పైగా పోస్టర్ లో వినూత్నంగా రాసుకొచ్చిన మ్యాటర్ కూడా సినిమా పై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.

    ఇక ఈ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పూర్తిగా కొత్తగా ఉంటుంది అని, కొత్త దర్శకుడు శరత్ డిఫరెంట్ యాంగిల్ లో ఈ సినిమాని తీస్తున్నాడని.. అతని దర్శకత్వంలో ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతుంది. అంత నమ్మకం ఉంది కాబట్టే.. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.

    నిజానికి మొదటి నుంచి కూడా ఈ ప్రాజెక్టు విషయంలో రవితేజ ఫ్యాన్స్ ఆసక్తి చూపించడం లేదు. కొత్త దర్శకుడు కాబట్టి, కాంబినేషన్ కి విలువ లేదు కాబట్టి, ఈ సినిమా పై ఇండస్ట్రీలో కూడా ఎలాంటి బజ్ లేదు. కానీ, ఈ సినిమా మేకర్స్ ఆసక్తికర హింట్స్ తో అదిరిపోయే అప్డేట్స్ తో మొత్తానికి ఈ సినిమా పట్ల రవితేజ అభిమానులు ఇంట్రెస్ట్ చూపించేలా చేసుకోవడంలో టీమ్ బాగా సక్సెస్ అయింది.

    ముఖ్యంగా చిత్రబృందం ప్రమోషన్స్ చాలా విభిన్నం ఉండటం ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. ఇక అక్కినేని నాగ చైతన్య నటించిన మజిలీ సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించిన దివ్యాంశ కౌశిక్ గుర్తుందిగా ? ఆమె ఈ సినిమాలో రవితేజకి జంటగా నటించబోతోంది.