8500 rupees pasta viral news: ప్లేట్ పాస్తా ఎంత ఉంటుంది.. మహా అయితే 100.. ఒకవేళ ఖరీదైన రెస్టారెంట్ అయితే 250 కి మించదు. కానీ ప్లేట్ పాస్తా ₹8,500.. అదేంటి అదేమైనా బంగారంతో చేశారా.. వెండి కోటింగ్ ఏమైనా ఇచ్చారా.. అని అనుకోకండి. ప్లేట్ పాస్తాకు నిజంగానే అంత ఛార్జ్ చేశారు.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి ఆర్పిత ఖాన్ ముంబైలో ఒక రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్ మీద రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి. విభిన్నమైన వీడియోలు సర్కులేట్ అవుతూనే ఉంటాయి. ఆర్పిత ఖాన్ ఏర్పాటుచేసిన రెస్టారెంట్లో రేట్లు విపరీతంగా ఉంటాయని రకరకాల పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆ రెస్టారెంట్ లో క్రౌడ్ ఏమాత్రం తగ్గడం లేదు. పైగా అంతకుమించి అనే స్థాయిలో వ్యాపారం సాగుతోంది.
అర్పిత హోటల్లో ఇటీవల ఒక వ్యక్తి పాస్తా ఆర్డర్ చేశాడు. ఆస్వాదించుకుంటూ తిన్నాడు. బిల్లు చూసేసరికి గుండెలు బాదుకున్నాడు. మహా అయితే 300 కు మించి ఖరీదు చేయని పాస్తా కు ఏకంగా 8,500 బిల్లు వేశారు. దీంతో అతడు కళ్ళు పిండుకుంటూ ఆ బిల్లు కట్టాడు.. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది.. పాస్తాకు అంత ఖరీదా అంటూ నెటిజన్లు నోళ్లు వెళ్లబెడుతున్నారు.
సాధారణంగా సెలబ్రిటీలు రెస్టారెంట్లకు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. పైగా అక్కడ ధరలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. అందువల్ల చాలామంది ఆ ధరలను తట్టుకోలేక అక్కడికి వెళ్లలేరు. కేవలం బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే ఆ రెస్టారెంట్లకు వెళుతుంటారు. అప్పుడప్పుడు డబ్బున్న వాళ్ళకు కూడా ఆ ధరలు చూసి భయం మొదలవుతుంది. ఈ పాస్తా తిన్న వ్యక్తి కూడా అటువంటివాడే. 350 రూపాయలతో పోయేదాన్ని.. 8500 పెట్టి తిన్నాడు. చివరికి ఇదిగో ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి.. తనకు జరిగిన క్షవరం గురించి చెప్పుకున్నాడు. ఎంతైనా సెలబ్రిటీల రెస్టారెంట్ల వేరు. అదే కస్టమర్ల జేబుకు చిల్లు పెట్టడానికి..